English | Telugu
హోమ్ ఐసొలేషన్‌లో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు.. ఫైనల్ లిస్ట్ ఇదేనా?
Updated : Aug 19, 2021
రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5న ప్రారంభం కావడానికి రంగం సిద్ధమవుతోంది. వరుసగా మూడోసారి హోస్ట్ బాధ్యతలను అక్కినేని నాగార్జున నిర్వర్తించనున్నారు. కొవిడ్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కంటెస్టెంట్లకు ఇప్పటికే టెస్టులు నిర్వహించారు. వారంతా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని సమాచారం.
గత ఏడాది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు కంటెస్టెంట్లను హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచిన నిర్వాహకులు ఈసారి ఎవరి ఇళ్లల్లో వారిని ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కోరారు. గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ 5 హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వెలువడుతూ వస్తున్నాయి. చాలామందికి తెలిసిన ముగ్గురు సెలబ్రిటీలు యాంకర్లు రవి, వర్షిణి సౌందరాజన్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం హౌస్‌లోకి ఖాయంగా వెళ్లనున్నారు.
వీరు కాకుండా కొరియోగ్రాఫర్లు రఘు, ఆనీ, నటరాజ్, ఆర్జే కాజల్, వీజే లోబో, సిరి హన్మంత్, ఆట సందీప్, నటి శ్వేతావర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఇషా చావ్లా, టీవీ నటి నవ్య స్వామి పేర్లు కూడా రంగంలో ఉన్నప్పటికీ అది కేవలం స్పెక్యులేషనే అంటున్నారు.