English | Telugu
దీపకు దొరికిన మోనిత! నెక్స్ట్ ఏంటి?
Updated : Sep 7, 2021
మారువేషాలతో కార్తీక్, దీప కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్న మాయలేడి మోనిత ఆటలకు ఇక చెక్ పడినట్టే. అయితే, 'కార్తీక దీపం' సీరియల్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. మోనిత మరణించలేదు అన్నది నిజం. కార్తీక్ చేత తన మెడలో తాళి కట్టించుకోవాలని నాటకాలు ఆడుతున్న మాట నిజం. మూగమ్మాయిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్తీక్ కి టీ ఇవ్వడం, సోదమ్మగా దీపను చంపడానికి ప్రయత్నించడం, డాక్టర్ రీనాగా మారు వేషంలో పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రిలో తిరుగుతుండటం నిజం. అయితే, ఇన్నాళ్లూ మోనితను ఎవరూ పట్టుకోలేకపోవడంతో దొరలా దర్జాగా తిరుగుతోంది. అయితే, ఇప్పుడు మోనితను దీప పట్టుకుంది. సారీ... మోనిత చేసిన మిస్టేక్స్ వల్ల దీపకు దొరికేసింది. దాంతో నెక్స్ట్ ఏం అవుతుందోననే ఆసక్తి సీరియల్ అభిమానుల్లో మొదలైంది.
కార్తిక్ అలియాస్ డాక్టర్ బాబుకు కడుపు నొప్పి వచ్చేలా చేసి... అతడిని ఆస్పత్రికి మోనిత రప్పించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించడం, వార్నింగ్ ఇవ్వడంతో మోనిత గురించి కార్తీక్ ఎవరికీ చెప్పలేకపోతున్నాడు. అయితే, రోజూ ఆస్పత్రికి దీప వస్తున్న సంగతి కూడా తెలిసిందే. భర్త తినేసిన తర్వాత క్యారేజ్ పట్టుకుని బయటకు వస్తుంది దీప. వాష్ బేసిన్ ముందు నిలబడి మోనిత ఫోన్ మాట్లాడుతుంది. వాష్ బేసిన్ ముందున్న అద్దంలో మోనిత ముఖం దీపకు కనిపిస్తుంది.
'మోనిత! డాక్టర్ రీనా వేషంలో వచ్చింది మోనిత!!' అని దీప మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కోపంతో మోనిత దగ్గరకు నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. అప్పుడు 'త్వరగా నీ పెళ్ళాన్ని ఇక్కడి నుండి పంపించేయ్. డైరెక్టుగా నా మెడలో తాళి కట్టేసేయ్' అని ఫోనులో కార్తీక్‌కి మోనిత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చేతిలో ప్లేట్స్ కిందకు గట్టిగా కొడుతుంది దీప. వెనక్కి తిరగడంతో దీపకు మోనిత దొరికేసింది. దీంతో ఏం జరుగుతుందనే ఆసక్తి ఎక్కువైంది.