English | Telugu

మాన‌స్ మీద మ‌న‌సుప‌డ్డ ప్రియాంక‌?!

'బిగ్ బాస్ 5'లో ప్రేమకథలు షురూ చెయ్యడానికి ఎక్కువ సమయం తీసుకోవడానికి నిర్వాహకులు ఇష్టపడటం లేదనుకుంట! ఆల్రెడీ ఓ కథను మొదలుపెట్టారు. మానస్ నాగులపల్లి మీద ట్రాన్స్‌జెండర్ ప్రియాంక మనసు పారేసుకున్న‌ట్టు ఉన్నారు.

'నువ్వు నన్ను ఏమని పిలుస్తావ్?' అని ప్రియాంకను యాంకర్ రవి అడిగితే... 'అన్నయ్య' అని ఆన్సర్ ఇచ్చింది. 'విశ్వను ఏమని పిలుస్తావ్' అని అడిగితే... ప్రియాంక నోటి నుండి 'అన్నయ్య' వచ్చింది. 'మానస్ ను' అని అడిగితే... 'అట్లా ఏమీ పిలవను' అని తప్పించుకుంది. దీనిబట్టి మానస్, ప్రియాంక మధ్య 'బిగ్ బాస్ 5'లో ప్రేమకథకు పునాది పడిందా? వేస్తున్నారా? అని అనిపిస్తోంది.

'బిగ్ బాస్' బుధవారం ఎపిసోడ్ లో విశ్వకు పవన్ రూమ్ యాక్సెస్ లభించింది. అతడు ఎంపిక చేసిన ఇద్దరు సభ్యులు ఒంటి మీద దుస్తులతో సహా వాళ్ళ వస్తువులన్నీ స్టోర్ రూమ్ లో పెట్టాలని 'బిగ్ బాస్' ఆదేశించాడు. యాంకర్ రవి, ప్రియ పేర్లు చెప్పాడు విశ్వ. దాంతో రవి ఓ అమ్మాయి డ్రస్ వేసుకున్నాడు. ఈ ప్రోమో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక, ఇదే ప్రోమో కింద షో టైమింగ్ మార్చమని ఒకరు రిక్వెస్ట్ చెయ్యడం గమనార్హం.

"మా (స్టార్ మా) యాజమాన్యానికి చిన్న విన్నపం ఏమనగా... 'బిగ్ బాస్ - 5' రోజువారీ దృశ్య ప్రదర్శన కాలము(టెలికాస్ట్ టైమింగ్)ను రాత్రి 9:30కి కొనసాగించాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుచున్నారు. గమనించగలరు" అని ఒకరు కామెంట్ చేశారు. దీనికి వెయ్యికి పైగా లైక్స్ వచ్చాయి. రోజూ రాత్రి పది గంటలకు 'బిగ్ బాస్' ప్రసారం కానుంది. వీకెండ్స్... శని, ఆదివారాలు తొమ్మిది గంటలకు ప్రసారం చేస్తున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ పట్టించుకుని టైమింగ్ మారుస్తారో? లేదో? చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.