English | Telugu

'బిగ్ బాస్' షోపై లోబో సెటైర్స్‌! ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్!

"అరే.... 'బిగ్ బాస్'కి ఒక దండంరా అయ్యా నిజంగా! నిజంగా దేవుడు ఉన్నాడు తెలుసా. బిగ్ బాస్... నాట్ ఎట్ ఆల్ మై కప్ ఆఫ్ టీ. అది నా టేస్ట్ కాదు. నాకు నచ్చదు ఆ షో" - ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? 'బిగ్ బాస్' సీజన్ 5లో ఆరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన లోబో.

గతంలో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో మీద లోబో సెటైర్స్ వేశాడు. కట్ చేస్తే... అదే షో సీజన్ 5లో అడుగుపెట్టాడు. 'బిగ్ బాస్' హౌస్ లోపలికి వెళ్లిన తర్వాత హౌస్ సూపర్‌గా ఉందంటూ విపరీతమైన కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. దాంతో అతడిని నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత లోబో ఏం చెబుతాడో చూడాలి. అప్పుడు ఎందుకు నచ్చలేదన్నాడో... తర్వాత షోలోకి ఎందుకు వెళ్ళాడో... ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఉండటం గ్యారెంటీ.

ఇక, షోలో లోబో బిహేవియర్ ఆకట్టుకోవడం లేదంటున్నారు మెజారిటీ ఆడియన్స్. అయితే, అతడి గెటప్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి కొన్ని రోజులు షోలో ఉంచే అవకాశాలు ఉన్నాయి.