English | Telugu

ఫ్యామిలీతో కలిసి జానీ మాస్టర్ దీపావళి సెలబ్రేషన్స్.. ఇండస్ట్రీ షేక్ ఐపోవాలి


జీవితం అన్నాక అన్ని సందర్భాల్లో ఒక్కలాగే ఉండదు. గుక్క తిప్పుకోనివ్వని అదృష్టం ఉంటుంది కోలుకోలేని కష్టము ఉంటుంది. కానీ ఏది వచ్చినా తట్టుకున్న వాడు ఎప్పటికీ ఓడిపోడు అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ విషయంలో అదే జరిగింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాష్టర్ జైలు నుంచి అక్టోబర్ 25 న చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి బయటకు వచ్చాడు. జానీ మాష్టర్ లైఫ్ లో ఇదొక చీకటి కోణం అని చెప్పొచ్చు..నిజం ఎంతో, అబద్దం ఎంతో తెలీకపోయినా జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తన కుటుంబంతో దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నాడు. "ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచా లాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి." అంటూ విషెస్ మెసేజ్ పెట్టాడు.

ఇక నెటిజన్స్ ఐతే వాళ్ళ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. "మాష్టర్ రాబోయే సినిమాలకు కోరియోగ్రఫీ చేయండి. మీ డాన్స్ అంటే మాకు ఇష్టం. ఈసారి జానీ మాష్టర్ దెబ్బకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్ కావాలి..మీ కం బ్యాక్ కోసం మేమంతా వెయిటింగ్... అన్నా ఈ సారి నువ్వు సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే "బుట్ట బొమ్మ" పగిలిపోవాల..ఈ దీపావళి పండగతో మీకు ఉన్న ద్రుష్టి పోయి మంచి స్థానానికి వెళ్ళాలి ..నిజం ఒక్కటే మిగులుతుంది..కర్మ ఈ జీవితంలో ఎవరిదీ వాళ్లకు ఇచ్చేస్తుంది " అంటూ మెసేజెస్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.