English | Telugu

లవ్ ట్రాక్ నడిపిస్తినే హౌస్ లో ఎక్కువ రోజులు..వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ!

బిగ్ బాస్ హౌస్ గురించి అందరు తమకి నచ్చిన ఒపీనియన్ చెప్తుంటారు. ఓవరాల్ గా ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడమే మెయిన్ గోల్. ఆ ఎంటర్‌టైన్మెంట్ అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు.. టాస్క్ లు ఆడి.. ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వొచ్చు.. కామెడి చేసి గొడవలు పెట్టుకొని కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వొచ్చు.

ఇక ఇప్పుడు కొత్త అంశం బిబి లిస్ట్ లోకి వచ్చేసింది. అదేంటంటే ఎంటర్టైన్మెంట్, టాస్క్ లు ఇవి ఉంటే సరిపోదు.. హౌస్ లో లవ్ ట్రాక్ నడిపిస్తే చాలు ఈజీగా నెట్టుకొని రావచ్చు. అదే ఫాలో అయిన సోనియా ఫెయిల్ అయి బయటకు వచ్చేసింది. కానీ విష్ణుప్రియ ఇంకా ఉంది. ప్రతీ సీజన్ లో కూడా లవ్ ట్రాక్ అనేది కామన్ గా మారిపోయింది. ఈ సీజన్ మొదటి వారం నుండి పృథ్వీ- విష్ణుప్రియ లవ్ ట్రాక్ అని న్యూస్ వైరల్ అవుతుంది. ఆ విషయం స్వయంగా విష్ణునే చెప్పింది కానీ అది వన్ సైడ్ లవ్ అని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నానంటూ పృథ్వీ అయితే చెప్తున్నాడు.

గత మూడు వారాలలో నామినేషన్లో ఉన్న పృథ్వీ.. ఓటింగ్ లిస్ట్ లో చివరగా ఉన్నా కూడా తను బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే విష్ణుప్రియ-పృథ్వీల లవ్ ట్రాక్ ద్వారా ఎంటర్టైన్మెంట్ వస్తుందని బిగ్ బాస్ మామ భావించాడు. అయితే హౌస్ మొత్తంగా మోస్ట్ అండ్ వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే తను విష్ణుప్రియే అని అందరు చెప్తారు. ఎందుకంటే నామినేషన్లో ప్రాపర్ రీజన్ చెప్పదు.. ఒక్క టాస్క్ ఆడదు.. అసలు విష్ణుప్రియకి ఏదైనా గెలవాలనో.. చీఫ్ అవ్వాలనో ఏం ఉండదు. ఎంతసేపు పృథ్వీ పక్కన కూర్చొని నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురి అవుతుంది. ఇక మరోవైపు యష్మీ- నిఖిల్ ల లవ్ ట్రాక్ సాగుతోంది. నిఖిల్ కి తన మనసులో మాట చెప్పేసిన‌ యష్మీ.. తనేం రియాక్ట్ అవ్వకపోయిన కూడా క్లోజ్ గా ఉంటుంది. అది చూసి తనకి ఇష్టమే అని అర్థమవుతుంది. వాళ్ళ ట్రాక్ కూడా మెల్లిగా సెట్ అయినట్లే. ఇక గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడ. వచ్చి రాగానే యష్మీకి ప్రపోజ్ చేసాడు కానీ తను నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని గౌతమ్ తో క్లోజ్ గా ఉంది‌. ఆ విషయం గత వారం వీకెండ్ లో నాగార్జున రీవీల్ చేసేసరికి గౌతమ్ కి బుర్ర పాడైంది. దాంతో యష్మీకి నామినేషన్ చేశాడు గౌతమ్. అక్క.. అక్క అంటు యష్మీకి చిరాకు తెప్పించాడు గౌతమ్. అయితే వీరిలో ఏ లవ్ ట్రాక్ చివరి వరకు వస్తుందో‌ చూడాలి మరి!

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.