English | Telugu

తాగుబోతు రమేష్ జీవితంలో ఇంత విషాదం ఉందా...

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా అలరించింది. ఇందులో శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్తా శ్రీదేవి పురంగా మారిపోయింది. ఎందుకంటే కోరికలు తీరని వాళ్లంతా దెయ్యాలై ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఆది, నరేష్ వాళ్లంతా ఎంటర్టైన్ చేసి ఆ దెయ్యాలకు విముక్తి కల్పించారు. ఒక్కో సెగ్మెంట్ ఒక్కోలా నవ్వించింది. చివరిగా ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన పండు, ప్రవీణ్, తాగుబోతు రమేష్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించి వాళ్ళని సంతోషపెట్టారు. ఇక ఈ సెగ్మెంట్ లో తాగుబోతు రమేష్ చాలా ఏడ్చేశాడు. "పొద్దున్న లేచి ఎదురుగా కనిపించేది అమ్మ. వాళ్ళు ఎన్ని తిట్టినా, కొట్టినా చివరకి అమ్మ అంటే అమ్మే..మీకు మీ అమ్మగారితో ఉన్న రిలేషన్ గురించి చెప్పండి" అని రష్మీ అడిగింది. "నాకనే కాదు అందరికీ అమ్మలతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది.

ఎందుకంటే ప్రపంచంలో నిజాయితీపరురాలు అమ్మ కంటే ఇంకొకరు ఉండరు. నా 13 ఏళ్ళ వయసులో మా అమ్మ చనిపోయింది. నాకు, అమ్మకు, స్క్రీన్ కి ఎక్కవ సంబంధం ఉండేది. ఎప్పుడైనా అమ్మ పిలిచి మరీ ఎక్కువ ప్రేమ చూపించేటప్పుడు సాధారణంగా అందరం అనుమానిస్తూ ఉంటాం. ఆరోజు గుడ్లు కూర వండింది. ఒళ్ళో కూర్చుబెట్టుకుని తినిపించింది. నాకు అర్ధం కాలేదు. ఇంత ప్రేమ చూపిస్తోంది ఏమిటా అనుకున్నా. నులక మంచానికి కట్టేసి గాడిద కొడుకా చెప్పకుండా సినిమాకు వెళ్తావా అని తిట్టింది. ఎందుకంటే సింధురపువ్వు అనే మూవీని ఫస్ట్ టైం చూసా. పిచ్చ కొట్టుడు కొట్టేసింది అప్పుడు. తర్వాత మళ్ళీ అమ్మకు తెలీకుండా 1995 లో రిక్షావోడు మూవీకి వెళ్ళా. చాలా హ్యాపీగా ఆ మూవీ చూస్తుంటే రవి అనే ఫ్రెండ్ వచ్చి...మీ అమ్మ చనిపోయింది అని చెప్పాడు. నాకు తెలిసి ప్రపంచంలో చిన్నప్పుడు అమ్మ చనిపోతే శూన్యమే మిగులుతుంది. నా లైఫ్ అంతా చీకటైపోయినట్టు ఐపోయింది ఆరోజు. నేను తాగుబోతు యాక్టింగ్ ఎప్పుడు చేసినా మా అమ్మ కోసమే చేసినట్టు ఫీలవుతాను. నేను యాక్టర్ కావడం మా అమ్మ చూస్తే బాగుండు అనుకున్నా. కానీ అప్పటికే చనిపోయింది. అందుకే దేవుడు నాకు ఇద్దరు ఆడపిల్లలను ఇచ్చాడు. " అని ఏడుస్తూ చెప్పాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.