English | Telugu
అషురెడ్డిని ఆర్జీవీ ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో!
Updated : Aug 18, 2021
బిగ్ బాస్ బ్యూటీస్, ముఖ్యంగా హాట్ ఇమేజ్ ఉన్న యాంకర్స్ మీద రామ్‌గోపాల్ వర్మ మనసు పారేసుకున్నట్టు ఉన్నారు. మొన్నామధ్య బిగ్ బాస్‌కు వెళ్లొచ్చిన అరియానాను వర్మ ఇంటర్వ్యూ చేశారు. అది మరీ బోల్డ్‌గా ఉందని కామెంట్లు వినిపించాయి. అందులో వర్మ హాట్ టాపిక్స్ డిస్కస్ చేశారు. అరియానా అందాలను ఎవరూ చూపించని యాంగిల్స్‌లో చూపించారు. ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డిపై వర్మ కాన్సంట్రేట్ చేశారు. ఆమెను ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో, ఆమెతో ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
వర్మ తనను ఫొటోలు తీస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిప్‌ను అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నో మీన్స్ నో... త్వరలో వస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్’ అని అషురెడ్డి పేర్కొంది. దీన్నిబట్టి అమ్మాయిలు వద్దంటే వద్దు అనే టాపిక్ మీద డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.
అషురెడ్డిని తనదైన శైలిలో, లో యాంగిల్స్‌లో వర్మ ఫొటోలు తీశారు. దానిపై, వర్మతో అషురెడ్డి తీసుకున్న సెల్ఫీపై ఆల్రెడీ మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. వర్మ టేస్ట్ సూపరని కొందరు అంటుంటే... వర్మ అలా ఫొటోలు తీయడం చూసి జాలి పడుతున్నానని ఇంకొందరు అన్నారు. ‘సిగ్గు లేదా నీకు ఛీఛీ’ అని ఒకరు అషురెడ్డి వీడియో కింద కామెంట్ చేశారు. ‘మరీ పాపులారిటీ కోసం ఇంత దిగజారాలా?’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.