English | Telugu

Hariteja: బిగ్ బాస్ హౌస్ లో తల్లి.. తనని టీవీలో చూసి తల్లడిల్లుతున్న కూతురు!

హరితేజ ఇండస్ట్రీలో హీరోయిన్ ల పక్కన సైడ్ క్యారెక్టర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. బుల్లితెరతో పాటు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అప్పుడు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

హరితేజకి ఒక చిన్న పాప కూడా ఉంది. తన పేరు భూమి. హరితేజ బయట ఉన్నప్పుడు ఎప్పుడు వేకెషన్ అంటు హాట్ ఫొటోస్ ని షేర్ చేసేది. హరితేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నేను అలా ఆడతాను.. ఇలా ఆడుతానంటూ నాగార్జునకి చెప్పింది. ఇక హరితేజకి సర్ ప్రైజ్ గా తన కూతురు భూమిని స్టేజి మీదకి పిలిచాడు నాగ్. తనని చూసి హరితేజ ఎమోషనల్ అయింది. ఇప్పటి వరకు ఏదో చేస్తానన్నాను.. తనని చూడగానే అంత తుస్ అయిందని తనని వదిలేసి వెళ్లలేక బాధపడుతుంది. హౌస్ లోకి వెళ్ళాక కూడ చాలాసార్లు తన కూతురిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. హరితేజ తన కూతురిని చాలా మిస్ అవుతుందని హౌస్ మేట్స్ అందరు ఫ్యామిలీ వీడియో క్లిప్ ఎపిసోడ్ లో తనకి అవకాశం ఇచ్చారు. తనకి ఛాన్స్ ఇవ్వడంతో భూమి ని చూపించారు. తనని చూసిన హరితేజ ఎమోషనల్ అయ్యింది.

అయితే తాజాగా భూమి తన తల్లిని టీవీలో చూసి అమ్మ.. అమ్మ అంటూ టీవీ దగ్గరికి వెళ్లి పిలుస్తున్న వీడియోని హరితేజ ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నేటిజన్లు ఎమోషనల్ గా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న హరితేజ డేంజర్ జోన్ లో ఉంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.