English | Telugu

ఎంటర్‌టైనర్ గా రోహిణి అన్ స్టాపబుల్.. బాధగా ఉందంటూ ఎమోషనల్!


బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ తో ఈ షో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. రోహిణి మంచి కామెడీ టైమింగ్ తో బిగ్ బాస్ హౌస్ లో దూసుకుపోతుంది. ఎప్పుడు చలాకిగా నవ్వుతుండే వాళ్ళ వెనకాల.. తెలియని బాధ కూడా దాగి ఉంటుంది. అందుకు రోహిణే సాక్ష్యం.

గత వారమే రోహిణి, తేజ ఇద్దరు మాట్లాడుకున్న ఎమోషనల్ వీడియో క్లిప్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో రోహిణి హౌస్ మేట్స్ తో తన ఎమోషన్ ని పంచుకుంది. రోహిణి ఆల్రెడీ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తను వచ్చిన సీజన్ లో ఆడే ఛాన్స్ అసలు రాలేదట.. ఒక ఎగ్ టాస్క్ మాత్రమే వచ్చింది. ఇక ఆ వీక్ బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా నాకు ఉండాలని లేదు. ఇప్పుడు వెళ్లిపొమ్మన్నా వెళ్ళిపోతాను. ఏదో తెలియని బాధగా ఉంది. ఏదో చెప్పాలని చూస్తే ఏదో అంటున్నారు.. నాకు బాధేస్తుందని రోహిణి ఎమోషనల్ అవుతుంది.

ఇక అక్కడే ఉన్న హరితేజ.. నువ్వు చెప్తున్నావ్.. నేను చెప్పట్లేదు బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేసి వస్తున్నాను. ఇక్కడ ఎవరికి మన బాధ చెప్పుకున్నా కూడా వాళ్ళకి నామినేషన్ పాయింట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతామని రోహిణితో హరితేజ అంటుంది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. వాళ్ళు రాయల్స్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇరు క్లాన్స్ మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయి. అందుకే ఆలా ఇద్దరు అనుకుంటున్నారు. అయితే రోహిణి మాత్రo తన వంతు గా ఎంటర్‌టైన్మెంట్ చేస్తూనే ఉంది. రోహిణి ఎంటర్‌టైన్మెంట్ లో తోపు అనిపించుకుంటుంది. అదే విధంగా టాస్క్ లో ఆడాలనుకుంటే హౌస్ మేట్స్ అవకాశం ఇవ్వడం లేదు.. గేమ్ ఆడే ఛాన్స్ రావట్లేదనే తను ఫీల్ అవుతుందేమో మరి. నిజంగా పర్ఫామెన్స్ ఇచ్చేవాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఇవ్వకుండా.. వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న యష్మీని పాజిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.