English | Telugu

Singer Noel : బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ నోయల్!

తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్లలోనూ ది బెస్ట్ అంటే.. అభిజిత్ విన్నర్ అయిన సీజన్-4 అని చాలామంది అంటుంటారు. ఈ సీజన్‌ ప్రారంభంలో సింగర్ నోయల్ రెండుసార్లు హౌస్‌కి కెప్టెన్ అయ్యి దూసుకుని పోయాడు. ఆ తర్వాత నోయల్.. ఫిజికల్ టాస్క్‌లలో సరిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. (Bigg Boss Telugu)

నోయల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చాడు. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేసరికి నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విషయం వాళ్లకి చెప్పేసరికి.. ఇంట్లోనే క్వారంటైన్ చేయమన్నారు. అలా నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నా. తిరిగి నాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత.. హోటల్ రూంకి మూవ్ చేశారు. వాళ్లు మనల్ని హౌస్‌లోకి పంపేముందే.. షాక్ ట్రీట్ మెంట్స్ స్టార్ట్ చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే.. నేను హోటల్ రూంలో ఉన్నాను.. సడెన్‌గా స్టాఫ్ వచ్చి నా దగ్గర ఫోన్ లాగేసుకున్నారు. ఒక డ్రామా క్రియేట్ చేసి.. మనల్ని తీవ్రమైన ఒత్తిడిలో పెడతారు. అలా నా దగ్గర ఫోన్ లాగేసుకున్నారు. హౌస్‌లోకి ఎప్పుడు పంపిస్తారని.. అడిగితే వాళ్ల నుంచి నో రెస్పాన్స్. బిగ్ బాస్‌లోకి నా ఎంట్రీ షూట్ అయ్యి రోజున్నర తరువాత అప్పుడు హౌస్‌లోకి పంపారు. అప్పటికి నా కాలుకి ప్రాబ్లమ్ ఉంది.. మెడిసిన్ వాడుతున్నా. అది వాళ్లతో చెప్పినప్పుడు.. మందులు కంటిన్యూ చేసుకోవచ్చని చెప్పారు. నేను హౌస్‌లోకివెళ్లేముందు.. ట్రీట్ మెంట్ నిమిత్తం కావాల్సిన మందులన్నీ మా వాళ్లు పంపించారు. వాటిని హౌస్‌లోకి పంపిస్తాం అని బిగ్ బాస్ టీం చెప్పారు.

నేను హౌస్‌లోకి వెళ్లాను. ఆ ముందుల్ని నేను రాత్రి వేసుకోవాలి.. ఉదయాన్నే వేసుకోవాలి. కానీ.. రెండు రోజులుగా అడుగుతున్నా.. వాళ్లు మాత్రం మందులు పంపట్లేదు. నేను మందులు వేసుకోవాలి.. నా కాళ్లు పనిచేయడం లేదు.. మందులు పంపించండి బిగ్ బాస్ అని చాలాసార్లు అడిగాను. కానీ వాళ్లు అస్సలు పట్టించుకోలేదు. దాంతో నాకు పెయిన్ ఎక్కువ అయ్యింది. పైగా అవి మామూలు మందులు కాదు. స్టిరాయిడ్స్.. అవి వేసుకుంటేనే నా కాళ్లు పనిచేసేవి. వాటిని ఇవ్వకపోయేసరికి.. నా పెయిన్ ఎక్కువ అయిపోయింది. ట్యాబ్లెట్స్ మధ్యలో మానకూడదు.. కోర్స్ మధ్యలో బ్రేక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.. నా పెయిన్ ఎక్కువ అయిపోతుందని ఎంత చెప్పినా కూడా.. నాకు మందులు పంపించలేదు.

బయటకు వచ్చిన తరువాత.. నన్ను ఎవరైతే కోఆర్డినేట్ చేశారో అతన్ని గట్టిగా నిలదీశా. ఇదే పని నేను నీకు చేస్తే ఎలా ఉంటుంది? నీపై హ్యూమన్ రైట్ కేసు వేస్తా అని అన్నాను. నేను వాళ్లని బెదిరించలేదు. నా బాధను వ్యక్తపరిచాను. కానీ వాళ్లు మాత్రం.. నోయల్ బెదిరించాడు అని అన్నారు. నేను బాధపడితే అది వాళ్లకి బెదిరింపులా అనిపించింది. నాకు బెదిరించాల్సిన అవసరం లేదు. నన్ను బిగ్ బాస్ హౌస్‌లో అంత బాధపెట్టినప్పుడు.. సాటి మనిషిగా నేను స్పందించాను. అది కూడా తప్పని అన్నారు. బెదిరించానని నాపైనే తిరగబడ్డారంటూ బిగ్ బాస్ వాళ్లు ఎలా ఉంటారో సింగర్ నోయల్ చెప్పుకొచ్చాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.