English | Telugu

అవునా, నిజమా అతను గడ్డం నవీనా..

గడ్డం నవీన్ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులరైన నటుల్లో ఒకరు. నెత్తి మీద ఉండాల్సిన జుట్టు మొత్తం గడ్డంగా మారిపోయింది. అలా గుబురు గెడ్డంతో మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నాడు నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు ఇలా ఎన్నో పేర్లతో ఆయన్ని పిలుస్తారు. గడ్డం నవీన్ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 26 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఐతే గడ్డం నవీన్ చాలా మూవీస్ లో చేశారు. ఐతే అప్పట్లో బాగా జుట్టు ఉండేది. ఇప్పుడు అసలు జుట్టే లేదు.

దాంతో అప్పటి ఫోటో ఇప్పటి ఫోటో పక్కపక్కన పెడితే అవునా.. నిజమా గడ్డం నవీన అనకుండా మాత్రం ఉండలేము. అలాంటి కొన్ని పిక్స్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు నవీన్. తమ్ముడు, ఆది మూవీస్ లో ఆయన పిక్స్ చూసిన వాళ్ళు నోరెళ్లబెడుతున్నారు. ‘ప్రేమించేది ఎందుకమ్మా’ సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డికి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసాడు నవీన్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసాడు నవీన్. ‘రామసక్కనోడు’, ‘ఆది’, ‘ఇష్టం’, ‘6 టీన్స్’, ‘ఇడియట్’, ‘బ్యాడ్ బాయ్స్’ సినిమాల్లో నటించడంతో పాటు విలన్ గ్యాంగ్స్‌లో కూడా ఒకరిగా నటించాడు నవీన్. 150 సినిమాలలో చేసిన నవీన్ ఇప్పుడు జబర్దస్త్ లోకి వచ్చి అలరిస్తున్నాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.