English | Telugu

నిఖిల్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా...హౌస్ లో పత్తాపారాలు


బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ తర్వాత యష్మీకి నాగ మణికంఠకు మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. తను సారీ చెప్పినా యష్మీ పట్టించుకోవడం లేదు.‌ ఇక సోనియా, నిఖిల్, పృథ్వీల ట్రయాంగిల్ లవ్ ట్రాక్ సాగుతుంటే మరోవైపు కిర్రాక్ సీత ఫ్లర్టింగ్ గురించి నిఖిల్ అడిగింది. అదేంటో ఓసారి చూసేద్దాం.

ఫుడ్ కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. మొదటి టాస్క్ 'ఫొటో పెట్టు ఆగే టట్టు'. దీని ప్రకారం కంటెండర్లు వారి చీఫ్ ఫొటోలను ఇచ్చిన స్లాట్స్‌లో వీలైనన్నీ ఎక్కువగా పెట్టాలి.. అలానే ఎవరు పీకకుండా చూసుకోవాలి. ఈ టాస్కు కోసం శక్తి (నిఖిల్) టీమ్ నుంచి పృథ్వీ.. కాంతార (అభయ్) టీమ్ నుంచి నబీల్ పోటీ పడ్డారు. సంచాలక్‌గా సీత ఉంది. ఇక ఎప్పటిలానే పృథ్వీ-నబీల్ ఇద్దరూ గేమ్‌లో ఫిజికల్ అయ్యారు. దాదాపు కొట్టుకునే వరకూ వెళ్లింది. దీంతో ఒకరినొకరు పట్టుకోవడానికి వీల్లేదు.. మీ ఫొటోస్‌ను మీరు డిఫెండ్ చేసుకోవచ్చంటూ బిగ్‌బాస్ అన్నాడు. కానీ పృథ్వీ పట్టుకోవడంతో డిస్ క్వాలిఫై అయి కాంతార టీమ్ గెలిచింది.

ఇక తర్వాత మణికంఠ దగ్గరికెళ్లి నామినేషన్స్‌లో యష్మీ ఎందుకు హర్ట్ అయింది నిజం చెప్పరా.. నువ్వు ఫ్లర్ట్ చేశావా అంటూ నిఖిల్ అడిగాడు. దీనికి ఫ్లర్ట్ అని చెబుతుంది ఎవరు అది ఆలోచించు.. ఫ్లర్టేశ్వర్ చెబుతున్నాడంటూ సీత కౌంటర్ ఇచ్చింది. సరే నీతో మాట్లాడతాను.. నీతో కాకుండా ఇంకెవరితో నేను అలా మాట్లాడతాను చెప్పరా అంటూ నిఖిల్ అడిగాడు. సోనియా, యష్మీతో కూడా నువ్వు ఫ్లర్ట్ చేస్తావని సీత అనడంతో యష్మీతో సరిగా మాట్లాడనే మాట్లాడను.. ఇంక ఫ్లర్ట్ ఏం చేస్తానంటూ నిఖిల్ బదులిచ్చాడు. అయితే యష్మీని అడుగుదామా అంటూ విష్ణు మధ్యలో దూరడంతో యష్మీని పిలిచింది సీత. నిఖిల్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా నీతో అంటూ యష్మీని సీత అడిగితే..లేదు కన్ను కొట్టేవాడు.. నేనూ కొట్టేదాన్నంటు కొంటె సమాధానం చెప్పింది యష్మీ. దీనికి నేను సీతకి తప్ప ఇంకెవరికి పాడలేదు పాట అలా నిఖిల్ అన్నాడు. సరే అయితే ఓకే.. అంటూ సీత సిగ్గు పడింది. అయితే నువ్వు హ్యాపీ కదా.. అంటూ యష్మీ అడిగితే ఊ కొట్టింది సీత. అయితే మీరు మీరు చూసుకోండి అని వెళ్ళిపోయింది.

నువ్వే కదరా చెబుతా అన్నావంటూ నిఖిల్ అడిగితే నాకు వర్డ్స్ రావట్లేదు.. నీకు ఐడియా ఉంది కదా ఇది వేరేలాగా వెళ్లొచ్చు బయటికి.. అది బయటికెళ్లిన తర్వాత నువ్వు ఫేస్ చేయగలుగుతావా అంటూ సీత అడిగింది. తీసుకునేవాళ్లు ఎలాగైనా తీసుకుంటారు. ఇక్కడ మాట్లాడితే బయటికి ఎలా వెళ్తుందో నేను పట్టించుకోను.. ఎందుకంటే నీతో నేను ఏం మాట్లాడతాను.. వేరే వాళ్లతో ఏం మాట్లాడతాను అన్నది నాకు తెలుసంటూ నిఖిల్ అన్నాడు. నాతో నువ్వు ఏం మాట్లాడవులే అది వేరే విషయమంటూ సీత అంది. ఇలా ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. హౌస్ లో పత్తాపారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.