English | Telugu

జానీ మాస్టర్ వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందన...

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని.. అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం అందరిని ఆలోచింపచేసేలా చేస్తుంది. ఈ విషయంలో చిన్మయి శ్రీపాద తన స్పందనను ట్వీట్ చేసింది. తానూ గమనించిన విషయాలను కూడా చెప్పింది. "జానీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారనేది ముఖ్యం కాదు. రేపిస్టులు, నేరస్థులు ఈ దేశంలో ప్రతి పార్టీలోనూ ఉన్నారు. అతను ఎవరి ఫ్యాన్ అన్న విషయం కూడా ముఖ్యం కాదు. నేషనల్ అవార్డు విన్నరా కాదా అన్నది కూడా ఇక్కడ ముఖ్యం కాదు.

ఎవరి మూవీస్ కి వర్క్ చేసాడు ఎంత పెద్ద స్టార్స్ కి వర్క్ చేసాడు అన్నది కూడా పక్కన పెట్టాలి. బాధితురాలు పోలీస్ దగ్గరకు వెళ్లి కేసు పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యారా లేదా అన్నదే ముఖ్యం. కానీ మన దేశంలోని వ్యవస్థ ఎంత అద్వాన్నంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఎవరితో ఎలా బాధపడింది అన్నదే ఇంపార్టెంట్ ఆమె సపోర్ట్ చేసే సిస్టం ఉందా లేదా అన్నదే చూడాలి. బాధితురాలు తన బాధను ఎవరికీ చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టే పోలీసులను ఆశ్రయిస్తుంది. అప్పుడు అసలు విషయాన్ని విచారించాలి. కానీ అదే జరగడంలేదు. దాంతో బాధితులు సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తోంది. కానీ ఇక్కడ మైనర్ గా ఉన్నప్పటినుంచి ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఫైట్ చేస్తోంది ఈ అమ్మాయి అదీ ఇంత శక్తివంతమైన వ్యక్తుల మీద. ఈరోజున అమ్మాయిలు ప్రతీ రంగంలో ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారికి మీడియా కూడా అసలు విషయన్ని ఫోకస్ చేసేలా సపోర్ట్ చేయాలి అంతేకాని వాళ్ళను కించపరిచేలా చేయకూడదు. ఐనా అమ్మాయిలు కూడా లైంగిక వేధింపులకు గురయ్యాం అని చెప్పి ఇంట్లో కూర్చోనక్కర్లేదు. అవమానంతో అన్నిటికీ దూరం కావొద్దు. అవమానంతో సంబంధం లేని సమాజం కావాలంటే మనం ముందు భయపడడం మానేయాలి. అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.