English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తలని దూరం చేసిన శ్రీలత.. ఆ పని చేస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -187 లో.... సీతాకాంత్ ని రామలక్ష్మి కొంగున కట్టేసుకని వస్తుంది. అది చూసి ఇది అన్నంత పని చేసిందని శ్రీలత అనుకుంటుంది. ఇదేదో బాగుందని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత శ్రీలత వాళ్ళతో మాట్లాడుతుంటే.. రామలక్ష్మి వెళ్తు ఏవండి అంటూ పిలిచి.. మళ్ళీ కొంగున కట్టేసుకుంటుంది. అలా వాళ్ళని చూస్తూ శ్రీలత ఈర్ష్య పడుతుంది. ఇదేంటి బావ గారు ఎన్నడు లేనిది రామలక్ష్మి కొంగు పట్టుకొని తిరుగుతున్నారని శ్రీవల్లి అంటుంది. అది నాతో ఛాలెంజ్ చేసింది.. అందుకే అలా చేస్తుందని శ్రీలత చెప్తుంది.

ఇలా ఎందుకు చేసావో నాకు తెలుసని సీతాకాంత్ అంటాడు. పెళ్లి ఇలా తిరగలేదని ఇలా చేసున్నావని సీతాకాంత్ అంటాడు. మీ ఇష్టం మీరు ఎలా అయిన అనుకోండి అని రామలక్ష్మి అంటుంది. ఇంకా ఇలాంటివి ఏవైనా ఉంటే చెప్పమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో రామలక్ష్మి భయపడి సీతాకంత్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వచ్చి పిలుస్తుంది. ఏమైందని సీతా అడుగగా ఏదో కల వచ్చింది. నీకేదో అయినట్లు అని శ్రీలత యాక్టింగ్ చేస్తూ.. నువ్వు నా దగ్గర ఉండు అనగానే.. పదా అమ్మ అంటు శ్రీలత గదిలోకి సీతాకాంత్ వెళ్తాడు. నీ ఓడిలో పడుకోవాలని చెప్పి సీతాకాంత్ ఒడిలో శ్రీలత పడుకుంటుంది. మరొక వైపు నందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ.. తన హ్యాపీ నెస్ ని హారికతో షేర్ చేసుకుంటుంది. ఈ రోజు అంతా సీతాతోనే ఉన్నానని చెప్తుంది.

ఆ తర్వాత అసలు నందిని ఎందుకు వచ్చింది.. ఆ ఫోటో అక్కడ ఉందేంటని సీతాకాంత్ ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఉదయం శ్రీలత నిద్ర లేచి వాళ్ళని దూరం చేసానని అనుకుంటుంది. అప్పుడే రామలక్ష్మి కాఫీ తీసుకొని రావడం చూసి.. మళ్ళీ పడుకుంటుంది. రామలక్ష్మి సీతాకాంత్ ని నిద్రలేపుతుంది. అమ్మని లేపకని సీతాకాంత్ చెప్తాడు. వాళ్లకి పిల్లల సంతోషం ముఖ్యం.. రేపు నీకు పిల్లలు అయ్యాక తెలుస్తుందని సీతాకంత్ అంటాడు. సీతాకాంత్ వెళ్ళిపోయాక శ్రీలత పడుకున్నట్లు నటిస్తుందని గమనించి.. నాకు పిల్లలు పుడితే మా ఆయన ప్రేమ తన పిల్లలపై మాత్రమే ఉంటుంది. ఆ పనిలో ఉంటానని శ్రీలతకి వినపడేలా రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు మరొక ప్లాన్ చేస్తారు. రామలక్ష్మి సీతాకాంత్ లు రావడం చూసి.. వాళ్ళ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఏంటి అమ్మ నువ్వు నిప్పుల గుండంపై నడవడం ఏంటని సందీప్ అంటాడు. అప్పుడే సీతాకంత్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఒక జ్యోతిష్కుడు మీ ఇద్దరి జాతకాలు చూపిస్తే కొన్ని విషయాలు చెప్పాడని శ్రీలత అంటుంది. ఏంటని అందరు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.