English | Telugu
Guppedantha Manasu : రిషి గతం రివీల్ .. గుప్పెడంత మనసులో సూపర్ ట్విస్ట్!
Updated : Aug 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1165 లో... రాధమ్మని తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది సరోజ. పదా రంగా మన ఇంటికి వెళదామని రాధమ్మ అనగానే.. రంగా ఏంటి వాడు నా కొడుకు రిషి అని మహేంద్ర అంటాడు. రిషి కాదు రంగా అని చెప్పమని రాధమ్మ అనగానే.. లేదు నానమ్మ నేను రిషిని.. తన కొడుకుని, వసుధార భర్తని అని అనగానే రాధమ్మ, సరోజ షాక్ అవుతారు. మీకు రంగాని చూపిస్తానని రిషి అంటాడు. అప్పుడే సరోజ పక్కకి వెళ్లి నువ్వు వసుధర కలిసి నా బావ పూర్తిగా రిషిలాగా మార్చారు.. ఇప్పుడు అసలు రంగా చూపిస్తాను.. నేను రిషిని అంటున్నాడని శైలేంద్రకి ఫోన్ చేసి చెప్తుంది సరోజ. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. అసలు రంగా దగ్గరికి వెళ్తున్నారా.. నేను వస్తాను లొకేషన్ పంపు అనగానే సరోజ పంపిస్తుంది.
ఆ తర్వాత అసలు ఇదంతా ఏంటి అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. అంత అర్థం అయ్యేలా చెప్తానని వసుధార జరిగింది మొత్తం చెప్తుంది. రిషి రంగాలా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్తుంది. సర్ కార్ లో ఉన్న లెటర్ రంగాకి దొరికింది అంట.. అది ఇవ్వడానికి వచ్చినప్పుడు.. సర్ పై ఎటాక్ జరుగుతుంటే.. సర్ ని కాపాడి తనకు ప్రాబ్లెమ్ అయింది. అందుకే తన ప్లేస్ లో రిషి సర్ వెళ్ళాడని వసుధార చెప్తుంది. ఇంతకు ఆ లెటర్ ఎవరు రాసారని మహేంద్ర అడుగుతాడు. జగతి మేడమ్ రాసిందట అని వసుధార చెప్తుంది. అందులో ఏముందో చదవాలని మహేంద్ర అనగానే.. నాకు తెలియదు మావయ్య రిషి సర్ వచ్చాక అడిగి చదవాలని వసుధార అంటుంది. మరొకవైపు రాధమ్మ వాళ్ళని తీసుకొని చక్రపాణి ఇంటికి వస్తాడు రిషి. వాళ్లకు రంగాని చూపిస్తాడు. అతను రంగా ఏంటి అని సరోజ అంటుంది. అతనే మీ రంగా అంటూ రిషి జరిగింది మొత్తం చెప్తాడు.
ఆ తర్వాత రంగా మాట తీరు బట్టి రాధామ్మ అతనే రంగా అని తెలుసుకుంటుంది. ఇక సరోజకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచెయ్యగానే రంగా అని అర్ధం చేసుకుంటుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని రంగా అంటూ ఇబ్బంది పెట్టానని రిషికి సారీ చెప్తుంది సరోజ. అదంతా వింటున్న శైలేంద్ర షాక్ అవుతాడు. రంగాని తీసుకొని సరోజ వాళ్ళు వెళ్తారు. సరోజ వాళ్ళకి ఎదరుగా శైలేంద్ర వెళ్లి.. వీడు రంగా ఏంటని అడుగుతాడు. ఇతనే మా రంగా బావ అంటూ సరోజ చెప్తుంది. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్ళగానే రంగా వెళ్లాడా అంటూ వసుధార అడుగుతుంది. వెళ్ళాడని రిషి చెప్తాడు. అమ్మ లెటర్ రాసిందట అందులో ఏముందని మహేంద్ర అడుగుతాడు. అందరి గురించి మన చుట్టూ జరిగిన వాటి గురించి, మీ గురించి , అనుపమ, మనుల గురించి రాసారని రిషి అంటాడు. నేను ఆ లెటర్ చదువుతానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.