English | Telugu

భార్య కోసం భర్త చేసిన ఆ పనేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -249 లో....నేను ఇంట్లో నుండి వెళ్లడం సీతకాంత్ సర్ కి ఇష్టం లేకపోతే.. ఇప్పుడే వర్షం పడాలని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ పెద్దాయన కలిసి పై నుండి వాటర్ స్ప్రే చేస్తుంటారు. చూసారా అత్తయ్య నా భర్తకి నేను ఉండాలని ఉందని పైకి వెళ్తుంది. అక్కడ సీతాకాంత్ పెద్దాయన వాటర్ కొట్టడం చూసి.. నాకు తెలుసు సర్ నేను ఉండాలని మీకు ఉంది అని రామలక్ష్మి మురిసిపోతుంది.

ఆ తర్వాత శ్రీవల్లి, శ్రీలతలకి డౌట్ వచ్చి పైకి వస్తారు. సీతాకాంత్ పెద్దాయన లని చూసి.. చూసారా బావగారిని తన మాటలతో మార్చేసిందని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ గదిలోకి రాగానే.. అయ్యో వర్షంలో తడిశారా అని రామలక్ష్మి అంటుంది. అవును చెప్పడం మరచిపోయాను.. ఇందాక ఇలా మీకు నేను ఇక్కడ ఉండాలని ఉంటే వర్షం రావాలని మొక్కుకున్నా వర్షం వచ్చిందని ఏం తెలియనట్లు రామలక్ష్మి అంటుంది.

మరొకవైపు సీతాకాంత్ ని కలవడానికి డిటెక్టివ్ వస్తాడు. అక్కడ రిసెప్షనిస్ట్ సీతాకాంత్ కి ఫోన్ చేసి.. ఇలా ఎవరో వచ్చారని చెప్పగానే అభి గురించి చెప్పడానికి అయి ఉండొచ్చు వస్తున్నాను.. క్యాబిన్ లో కూర్చోమని చెప్తాడు. అపుడే నందిని, హారిక లు వస్తారు. డబ్బులు ఇస్తాను సీతాకి నిజం చెప్పకని అనగా... నేను చెప్తానని డిటెక్టివ్ అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ క్యాబిన్ కింద హారిక మైక్రో ఫోన్ పెడుతుంది. అతను చెప్పింది వీళ్ళు వినేలా సెట్ చేస్తారు. ఆ తర్వాత సీతాకంత్ రాగానే సర్ ఆ అభి గాడు ఇదంతా చేసాడు. రామలక్ష్మి మేడమ్ తప్పు లేదు.. నన్ను కొట్టి బంధించాడు సర్.. మీకు ఇంకో విషయం చెప్పాలని నందిని గురించి చెప్పబోతుంటే.. హారిక వచ్చి సర్ మీటింగ్ అర్జెంట్ అని చెప్పి సీతాకాంత్ ని తీసుకొని వెళ్తుంది. డిటేక్టవ్ చెప్పాలనుకున్నది పేపర్ పైన రాస్తుంటాడు. అప్పుడే నందిని వెళ్లి మళ్ళీ డిటేక్టవ్ ని బెదిరిస్తుంది. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి శ్రీవల్లి, శ్రీలత ఇద్దరు వచ్చి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా మంచి ప్లాన్ చేసావ్ అని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.