English | Telugu

Gangavva Elimination: గంగవ్వ ఎలిమినేషన్.. హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-8 లో గత వారం నుండి జరుగుతున్న మెగా ఛీఫ్ టాస్క్ ముగిసి అందులో ప్రేరణ గెలిచింది. నాలుగైదు సార్లు మెగా చీఫ్ కంటెండర్ అయ్యింది కానీ.. చివరి క్షణంలో ఆమె మెగా చీఫ్ కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. దాంతో ఆమె మెగా చీఫ్ అయితే బాగుండు అని అందరికీ అనిపించింది. అయితే పదో వారంలో ఎట్టకేలకు ఆమె మెగా చీఫ్ అయ్యింది.

ఇక పదో వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి మీద సీరియస్ అవ్వలేదు. ఎందుకో ఏమో ఈ వారం కాస్త సప్పగా సాగింది. ఇక హౌస్ మేట్స్ అందరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ లో ఎవరు వరెస్ట్ అనుకుంటున్నారో చెప్పమని నాగార్జున అడిగారు. ఇక ఈ తతంగం అంతా అయ్యాక చివరగా గంగవ్వని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమని అడిగాడు నాగార్జున. కాళ్ళు, చేతులు చల్లగా అవుతున్నాయని, రోజుకు ఒక్కపూటే తినడం అవుతుందంటూ తన సమస్యలు చెప్పుకుంది గంగవ్వ.‌ ఇక ఇంట్లో ఉండవ అని అడుగగా లేదని గంగవ్వ చెప్పింది. దాంతో తనని మెయిన్ గేట్ నుండి బయటకు వచ్చేయమన్నాడు నాగార్జున. ఇక హౌస్ మేట్స్ అంతా కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈవారం నామినేషన్స్‌లో లేని గంగవ్వని బిగ్ బాస్ హౌస్ నుంచి అనారోగ్య కారణాలతో ఇంటికి పంపిచేశారు. ఫ్యామిలీ వీక్ వరకూ మాత్రమే హౌస్‌లో ఉంటానని ముందే చెప్పింది గంగవ్వ. ఎనిమిదవ వారంలో ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తగా డాక్టర్లు కూడా పరీక్షించారు. దాంతో తొమ్మిదవ వారంలో బయటకు పంపిస్తారని అనుకున్నారు. కానీ ఈవారంలో గంగవ్వ కాస్త మెరుగ్గా ఆడింది. ఫ్యామిలీ వీక్ వరకూ పక్కాగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్య రీతిలో గంగవ్వని శనివారం ఎపిసోడ్‌లోనే ఇంటికి పంపించేశారు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.