English | Telugu
'ఢీ' మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేసిన డాన్సర్స్! ఏమైంది?
Updated : Jul 11, 2021
'మాస్టర్... సాంగ్ సెలక్షన్ బావుంది. నాకు కొరియోగ్రఫీ నచ్చింది. తనుశ్రీ... స్ట్రాంగ్ కంటెస్టెంట్' - ఇవి.. డాన్స్ మాస్టర్ సుదర్శన్, కంటెస్టెంట్ తనుశ్రీకి 'ఢీ' లాస్ట్ ఎపిసోడ్‌లో పూర్ణ ఇచ్చిన కాంప్లిమెంట్స్. తనుశ్రీ ఫెంటాస్టిక్ డాన్సర్ అని... తనలో స్వాగ్, యాటిట్యూడ్, స్టయిల్ వున్నాయని ప్రియమణి పొగిడారు. సుదర్శన్ చించేశాడని చెప్పుకొచ్చారు. 'కీప్ వర్కింగ్ హార్డ్' అని తనుశ్రీకి సలహా ఇచ్చారు.
కాంప్లిమెంట్స్ ఇచ్చి వారం కూడా కాకముందే తనుశ్రీ, సుదర్శన్ అనూహ్య రీతిలో డిజప్పాయింట్ చేశారు. రాబోయే ఎపిసోడ్‌లో తనుశ్రీ పెర్ఫార్మన్స్ ఉంది. లాస్ట్ టైమ్ గ్రూప్ డాన్సర్లతో మాస్ సాంగ్ ట్రై చేసిన సుదర్శన్... వేరియేషన్ చూపించాలని అనుకున్నాడో, మరొకటో మాంచి మెలోడీ సాంగ్ 'ప్రేమికుల రోజు'లోని 'రోజా రోజా' తీసుకున్నాడు. లిరిక్ కి తగ్గట్టు డాన్స్ వుండాలనే ఉద్దేశంతో రోజా అని వచ్చినప్పుడల్లా రోజా పువ్వు తీసే విధంగా కొరియోగ్రఫీ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అది బెడిసికొట్టింది. పూలను అందించే క్రమంలో కో-ఆర్డినేషన్ లోపించింది.
ప్రాక్టీస్ ఫుల్ గా చేయలేదో, తనుశ్రీకి జోడీగా వచ్చిన అబ్బాయికి, ఆమెకి కోఆర్డినేషన్ కుదరలేదో... సాంగ్‌లో సరిగా పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయారు. మధ్యలో సాంగ్ ఆపేశారు. లేటెస్టుగా విడుదలైన ప్రోమోలో దాన్ని చూపించారు. దానిపై టీమ్స్ మధ్య చాలా డిస్కషన్స్ జరిగినట్లు చూపించారు. ఇంతకు ముందు మంచి కాంప్లిమెంట్స్ అందుకున్న సుదర్శన్, తనుశ్రీ టీమ్ ఈసారి ఇలా ఎందుకు చేశారు? ఏమైంది? అనేది బుధవారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.
