English | Telugu

Brahmamudi : కొత్తకోడలికి అవమానం.. అప్పుకి కళ్యాణ్ సపోర్ట్ గా ఉండగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -496 లో.. కళ్యాణ్ గది బయట నిల్చొని ఆలోచిస్తుంటే అప్పు తన దగ్గరికి వస్తుంది. అక్కడ మా అమ్మ, రుద్రాణి అత్తయ్య నిన్ను అవమానిస్తారని కళ్యాణ్ అంటాడు. వాళ్లు ఏం అన్న నేను ఒక్క మాట ఎదురు చెప్పనని అప్పు అంటుంది. నీ గురించి నాకు తెలియదా.. నువ్వు ఎక్కడ ఊరుకుంటావ్. నువ్వు మా అమ్మను అన్న నాకే బాధ. అమ్మ నిన్ను అన్న నాకే బాధ అని కళ్యాణ్ అంటాడు. తాతయ్య వాళ్లు వచ్చి పిలిచాక కూడా వెళ్లకుంటే మర్యాదగా ఉండదు. వాళ్లు ఎన్ని మాట్లాడిన సరే నేను నోరు ఎత్తనని కల్యాణ్ చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తుంది. మరుసటి రోజు కావ్య పూజకు అంతా రెడీ చేస్తుంటుంది.

కాసేపటికి కళ్యాణ్, అప్పులు ఆటోలో‌ వస్తారు. ఇక ఇందిరాదేవి గుమ్మం బయటే ఆపి.. ధాన్యలక్ష్మిని ఇద్దరికి హారతి ఇవ్వమంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి తన మాటలతో అప్పుని అవమానిస్తారు. ఈమెనా నీ కోడలు. సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని రాకుండా ఇలా వచ్చిందేంటి. ఇలాంటిది నీ కొడుకు ఎలా నచ్చింది ధాన్యలక్ష్మి. నీ కోడలు ఎలా ఉంటుందా అని చూద్దామని వచ్చాం. ఇలా రావడమేంటని. నీ కోడుకు ఎలా మెచ్చాడని అప్పుని ముత్తయిదువులు తలో మాట అంటారు. ఏంటిది ఆదిలోనే హంసపాదం అన్నట్లు రాగానే ఇలా అవమానిస్తున్నారు అని రాజ్ అనుకుంటాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా. వెళ్లి సాంప్రదాయబద్ధంగా వ్రతం చేసుకుని సంబరాలు చేసుకో. ఇలా జరుగుతుందనే నేను రానని చెప్పాను. ఇప్పుడు నీకు అర్థమైందా అన్నయ్య నేను ఇంటికి ఎందుకు రాను అన్నానోనని కళ్యాణ్ అంటాడు. రేయ్ ఆగురా. గుమ్మం వరకు వచ్చి వెళ్తానంటావ్. ఇది నీ ఇల్లురా అని రాజ్ అంటాడు. కట్టుబట్టలతో బయటకెళ్లిన జంట పట్టుబట్టలతో రావాలని ఎలా అనుకుంటున్నారు. దానికున్నవి ఏవో అవి వేసుకుని వచ్చింది. ఇంట్లో చీరలకు కొదవ. కొత్త కోడలికి అమ్మమ్మ గారు చీరలు కొన్నారు. అవి కట్టుకుంటుంది. కవిగారు అసలు ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందులో మీ అమ్మ, అత్తయ్య లాంటి వాళ్లు ఉంటారు. అడుగు ముందుకే వేయండి. ఈ ముత్తయిదువుల్లోనే అలాంటి వాళ్లు ఉన్నారు. చాదస్తపు రేఖను దాటుతున్నానని ముందుకు రండి అని చెప్పిన కావ్య అక్క స్వప్నను పిలిచి వాళ్లకు హారతి తెమ్మని చెబుతుంది.

గుమ్మం ముందే అవమానిద్దామనుకున్నా. కావ్య చాలా తెలివిగా తీసుకొచ్చిందని ధాన్యలక్ష్మి అంటే.. ఇంట్లో అందరి సపోర్ట్ ఉండగా ఏం చేస్తావని రుద్రాణి అంటుంది. అడుగడుగునా అవమానించి జీవితంలో ఇంట్లోకి రాకుండా చేస్తాను అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. నువ్ ఎంతకైనా తెగించావ్. జీవితంలో కల్యాణ్ అప్పులు రాకపోతే చాలు అని రుద్రాణి అనుకుంటుంది. చీర కట్టుకోవాల్సిందే అని అప్పుకు నచ్చజెబుతుంది స్వప్న. ఎలా ఉన్నావే అప్పు అని కావ్య అడుగుతుంది. ఇన్నిరోజులు పట్టిందా ఈ మాట అడగటానికి అని అప్పు అనగానే కావ్య హగ్ చేసుకుంటుంది. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇక స్వప్న ఫీల్ అవుతూ మీరిద్దరు ఒక్కటేనే అని చెప్తుంది. ఇక అక్కచెల్లెళ్ళు సరదగా మాట్లాడుకుంటారు. కాసేపటికి ముత్తయిదువలకు అప్పు జ్యూస్ ఇస్తుంది. కావాలనే తనే తనపై మీద పోసుకుని కనీసం నీకు జ్యూస్ ఇవ్వడం కూడా తెలియదా అని ఒకామె అంటుంది. ఇంటికి వచ్చినవాళ్లను ఎలా చూసుకోవాలో నీకు తెలియదా. బొత్తిగా అడవి మనిషిలా ఉన్నావే అని ధాన్యలక్ష్మి అంటుంది. మీ అమ్మ నిన్ను ఊరిమీదకు వదిలేస్తే ఇలాంటి బుద్ధులే వస్తాయని ముత్తయిదువు అంటుంది. నేనేం కావాలని చేయలేదు ఆంటీ అని అప్పు అంటుంది. చాల్లే ఆపు. ఇంటికి పూజకని పిలిస్తే ఇలాగేనా అవమానించేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.