English | Telugu

Guppedantha Manasu: నీ తండ్రి ఎవరో కాదు, మా బాబాయ్ మహేంద్రే.. షాక్ లో‌ మను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1154లో.. తనని కిడ్నాప్ చేసింది మనునే అని శైలేంద్ర షాక్ అవుతాడు. ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావని శైలేంద్ర అడుగగా.. మను మౌనంగా ఉంటాడు. సరే.. గతంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టాను.. నిన్ను బాధపెట్టాను.. దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవడం కరెక్టే కానీ.. దానికి ఇది సరైన సమయం కాదని శైలేంద్ర అంటాడు. నాకు ఇదే సరైన సమయమని మను అంటాడు. కరెక్ట్ టైమ్ చూసి దెబ్బ కొట్టాడు వెధవ అని శైలేంద్ర మనసులో తిట్టుకుంటూ.. పైకి మాత్రం మన వదిలేయమని మనుని బ్రతిమిలాడతాడు.

నేను ఎన్నో ఏళ్లుగా కంటున్న కల.. ఈరోజుతో నెరవేరబోతుంది. నీకు కూడా తెలుసు కదా.. దాని కోసం నేను ఏమేమి చేశానో.. ఆ పదవి కోసం నేను దేనికైనా తెగిస్తానని నీకు తెలుసుకదా.. ఆ పదవి ఈరోజు నా సొంతం కాబోతుందని శైలేంద్ర అంటాడు. కలకంటున్నావా? అని మను అంటే.. లేదు.. నిజం.. టైమ్ ఎంత అవుతుందని శైలేంద్ర అడుగుతాడు. 11 అయ్యిందని మను చెప్పడంతో.. 11 అయ్యిందా?? రేయ్.. నన్ను ఎండీగా ప్రకటించే టైమ్ అయ్యిందిరా.. నన్ను వదిలెయ్ రా.. నీకు దండం పెడతాను. ప్లీజ్ రా.. కావాలంటే 12 గంటలకు వచ్చి నీకు లొంగిపోతానని శైలేంద్ర అంటాడు. నా ప్రశ్నకి సమాధానం కావాలి అని మను అంటాడు. నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఎలా ఉంటుందిరా అని శైలేంద్ర అడుగుతాడు. సమాధానం ఉంది కాబట్టే.. నిన్ను బంధించాను.. నా తండ్రి ఎవరు? నా కన్న తండ్రి పేరేంటి? అని అడుగుతాడు మను. దాంతో శైలేంద్ర.. నాకు తెలియదు అని అంటాడు. నీకు తెలుసని నాకు తెలుసు.. మర్యాదగా చెప్పమని మను అంటాడు. నాటకాలు ఆడొద్దు శైలేంద్రా.. నిజం చెప్పమని మను అంటాడు. నేను చెప్పను.. ఏం చేస్తావ్.. నీ తండ్రి ఎవరో తెలుసు కానీ చెప్పను. ఏం చేస్తావని శైలేంద్ర ఎదురుతిరుగుతాడు. ప్లీజ్ శైలేంద్రా.. నా తండ్రి ఎవరో చెప్పు.. 25 ఏళ్ల నుంచి ఈ ప్రశ్నకి సమాధానం దొరక్క.. నిరీక్షిస్తున్నానని మను అంటాడు. అబ్బా.. నువ్వెలా అడిగినా నేను నిజం చెప్పను... ఏం చేస్తావో చేసుకో.. నన్ను ఇక్కడ బంధీగా ఉంచినా కూడా నేను నిజం చెప్పను.. నాకు ఎలాంటి సమస్య లేదని శైలేంద్ర అంటాడు. నువ్వు అక్కడ లేకపోతే ఎండీగా ప్రకటించరు కదా అని మను అంటాడు. ఇక ఫణీంద్రకి మను కాల్ చేస్తాడు. కొత్త ఎండీనీ నేనే కదా అని శైలేంద్ర అనగా.. నువ్వు ఎండీవి ఏంట్రా.. వసుధార మాజీ ఎండీగా తనే ఒక వ్యక్తిని ఎండీగా ప్రకటిస్తానని చెప్తుందని ఫణీంద్ర అంటాడు. నా కల చెదిరిపోతుంది నీ కన్నతండ్రి ఎవరో చెప్తానని మనుతో శైలేంద్ర అంటాడు.

దాంతో శైలేంద్ర.. నీ తండ్రి ఎవరో కాదు.. మా బాబాయ్ మహేంద్రే అని నిజం చెప్పేస్తాడు. ఆ మాట వినగానే షాక్ అయిపోయిన మను.. ఏంటీ.. నా తండ్రి మహేంద్రా అని అడుగుతాడు. అవును మను.. మహేంద్ర భూషణే నీ కన్నతండ్రి అని శైలేంద్ర అంటాడు. దాంతో శైలేంద్రని లాగిపెట్టి కొడతాడు మను‌. నిజం చెప్తే కొడతావ్ ఏంట్రా అని శైలేంద్ర అడగడంతో.. నువ్వు అబద్ధం చెప్తున్నావ్.. నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని మహేంద్ర సర్ నా తండ్రి అని చెప్తున్నావని మను అడుగుతాడు. సాక్ష్యమా ఉంది.. అది చూపిస్తే నమ్ముతావా? అని శైలేంద్ర అంటాడు. గన్ తీసి శైలేంద్రకి మను గురిపెట్టి.. మహేంద్ర సర్ నా కన్నతండ్రి కాదని నాకు పక్కాగా తెలుసు.. మర్యాదగా నిజం చెప్పు.. లేదంటే పుచ్చ పేలిపోద్దని అంటాడు. రేయ్ రేయ్.. సాక్ష్యం చూపిస్తానని చెప్పాను కదా.. నా ఫోన్ నుంచి మా మమ్మీకి ఫోన్ చేయమని శైలేంద్ర ఫోన్ చేయిస్తాడు. అప్పుడు.. మను తండ్రి గురించి వసుధార రాసిన లెటర్ గురించి మాట్లాడి.. అది వెంటనే ఫొటో తీసి.. అర్జెంట్‌గా పంపించు.. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతానని శైలేంద్ర అంటాడు. వీడేదో ప్రమాదంలో ఉన్నాడని, కాలేజ్‌లో లేడని దేవయాని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.