English | Telugu
రష్మీ కాళ్ళు మొక్కిన సుధీర్!
Updated : Sep 7, 2021
టీవీ ఆడియన్స్‌కు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అంటే లవ్ బర్డ్స్. అయితే, అప్పుడప్పుడూ రష్మీ వయసు మీద సుధీర్ పంచ్ డైలాగ్స్ వేస్తుంటాడు. సీనియర్ సిటిజన్ అని, రష్మీ వయసు మూడు పదహార్లు అని కామెడీ చేస్తుంటాడు. వయసులో పెద్దదని కాళ్ళు మొక్కాడో, లేదో సరదాగా ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడో... వినాయక చవితి రోజున టెలికాస్ట్ కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్ లో రష్మీ కాళ్ళకు సుధీర్ మొక్కాడు.
ప్రతి శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో టెలికాస్ట్ అవుతుంది. ఈ శుక్రవారం వినాయక చవితి రావడంతో జబర్దస్త్ స్టేజి మీద గణేషుడి విగ్రహాన్ని పెట్టారు. అందరూ పూజ చేశారు. అక్కడ రష్మీ కాళ్ళు సుధీర్ మొక్కడం ప్రోమోలో చూపించారు. వినోదం పంచడంతో పాటు అందరూ ధూమ్ ధామ్ గా స్టేజి మీద చిందులు వేసినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. మరోసారి రికార్డింగ్ డ్యాన్స్ థీమ్ తో సుధీర్ టీమ్ ఫుల్ కామెడీ చేయడానికి సిద్ధమైంది.
రాకింగ్ రాకేష్ అయితే ఇప్పట్లో కిస్ కాన్సెప్ట్ స్కిట్లు వదిలేలా కనిపించడం లేదు. ఒకసారి రోహిణికి ముద్దు పెట్టడం డిస్కషన్ పాయింట్ అయితే... తర్వాత దాని మీద వీడియో చేశాడు. ఈసారి టీమ్ లో జంటల చేత ముద్దులు పెట్టించాడు. ముద్దుల చుట్టూ ఇంకెన్ని స్కిట్లు అల్లుతాడో?