English | Telugu

Bigboss boss 8 episode review : హౌస్ లో నిన్న ఏం జరిగిందంటే.. బిగ్ బాస్ రివ్యూ!

బిగ్ బాస్ హౌస్ లో గత వారం నుండి మెగా చీఫ్ కోసం పోటీ జరిగింది. అందులో నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ మెగా ఛీఫ్ అయ్యింది. ఇక ఈ టాస్క్ లో తనని సపోర్ట్ చెయ్యనందుకు నబీల్ పై కోపంగా ఉంటాడు పృథ్వీ. ఆ తర్వాత ప్రేరణ, రోహిణి లలో చివరి టాస్క్ జరిగింది. అంతవరకు వచ్చి చీఫ్ అవ్వలేకపోయానని రోహిణి పక్కకి వెళ్లి ఏడుస్తుంది.

ఓడిపోయినందుకు బాధ కంటే టాస్క్ లో కొంతమంది బెహేవ్ చేసిన తీరు బాలేదని అవినాష్ నిఖిల్ లకి బాధని చెప్పుకుంటుంది రోహిణి. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడం కోసం హరితేజ ని హరికథ చెప్పమంటాడు. హౌస్ మేట్స్ అందరి గురించి రెండు లైన్ లలో చెప్తుంది కానీ అది అంతా కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఏవిక్షన్ షీల్డ్ ఎవరికి రావద్దు అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఫోటో గల ఎగ్ ని స్నేక్ నోట్లో వెయ్యాలని.. ప్రేరణ మెగా చీఫ్ అయినందున తను అయిదుగురికి సంబంధించిన ఎగ్స్ ని స్నేక్ నోట్లో వెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు. విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ, గంగవ్వ, గౌతమ్ లకి సంబంధించిన ఎగ్స్ ని వేస్తుంది ప్రేరణ. ఆ తర్వాత నిఖిల్ , గౌతమ్ ఇద్దరు కలిసి తేజ ఫోటో ఉన్న ఎగ్ ని స్నేక్ నోట్లో వేస్తారు. నబీల్, అవినాష్ కలిసి యష్మీని.. విష్ణుప్రియ, పృథ్వీలు కలిసి ప్రేరణని..రోహిణి, హరితేజ కలిసి అవినాష్ ని చేస్తారు. తేజ,యశ్మీ చాలా సేపు టైమ్ తీసుకొని ఎకాభిప్రాయానికి రారు. ఇక యష్మీ కన్ఫమ్ కాకముందే నిఖిల్ కి సంబంధించిన ఎగ్ ని తేజ తీసుకొని వెళ్లి స్నేక్ కి వేస్తాడు. నేను వేస్తానంటూ రోహిణిది వేస్తుంది యష్మీ. ఇక ఫైనల్ గా మిగిలింది నబీల్.

నువ్వు రూల్స్ ఫాలో అవ్వలేదు.. ఇద్దరు ఎకాభిప్రాయంతో చెప్పాలి.. అలా ఎలా వేస్తావని నిఖిల్, యష్మీ కలిసి తేజపై విరుచుకుపడతారు. అసలు ఏంటి తేజ ఇలా చేసావని ప్రేరణ అనగానే.. మరేం చేయమంటావ్ తనది నాకు నచ్చలేదు.. నాది తనకి నచ్చలేదు.. నిర్ణయం తీసుకోవడంలో లేట్ అవుతుందని అలా చేసానని తేజ అంటాడు. నువ్వెవరు అలా చేయడానికి బిగ్ బాస్ చూసుకుంటాడు కదా అని ప్రేరణ అంటుంది. నేను చేసింది తప్పే.. దానికి బిగ్ బాస్ ఏ శిక్ష వేసిన రెడీ అని తేజ అంటాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.