English | Telugu

తల్లి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అషు!

రామ్‌ గోపాల్‌ వర్మ, అషురెడ్డి ఇంటర్వ్యూ మీద ఎవరి అభిప్రాయం వాళ్లది. కొంతమంది అషురెడ్డి కాళ్ళను మాత్రమే చూస్తున్నారు. కొంతమంది ఆమె చెప్పిన మాటలు వింటున్నారు. ఇంకొంతమంది వర్మ ప్రశ్నలను ఇష్టపడుతున్నారు. పలువురి అభిప్రాయాలను అషురెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అందులో ఆమెను పొగిడినవి ఎక్కువ ఉన్నాయి. తన థైస్‌ బావున్నాయని పెట్టిన కామెంట్‌ను కూడా అషురెడ్డి షేర్‌ చెయ్యడం విశేషం. అయితే, అన్నిటిలోకెల్లా ఆమె తల్లి అభిప్రాయం, అది విని అషురెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం ముఖ్యమైన విషయం.

‘‘ఇంటర్వ్యూ చూశాను. బావుంది. బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా మెసేజ్‌ చెప్పావ్‌. మాట్లాడావ్‌. సొసైటీకి మంచి మెసేజ్‌ ఇచ్చావ్‌. బానే ఉంది’’ అని అషురెడ్డి తల్లి చెప్పింది. దీనిని వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అషురెడ్డి పోస్ట్‌ చేసింది. కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ‘‘నిజంగా నేను ఏడుస్తున్నా. థాంక్యూ మామ్‌. మీ టైమ్‌ కేటాయించి అప్రిషియేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ’’ అని అషురెడ్డి చెప్పింది.