English | Telugu
షణ్ముఖ్ జస్వంత్‌కి పనోడిగా లోబో!
Updated : Sep 8, 2021
ఎవరి చేతిలో పవర్ రూమ్ యాక్సెస్ ఉంటే వాళ్లు చెప్పింది మిగతావాళ్లు చేయాల్సిందే! అందుకని, హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ పవర్ రూమ్ యాక్సెస్ కోసం పోటీపడ్డారు. ఒకసారి బజర్ మోగినప్పుడు డాన్స్ మాస్టర్ నటరాజ్‌తో పాటు హీరోయిన్ శ్వేతా వర్మ... ఇద్దరూ ఓకేసారి చెయ్యి పెట్టారు. దాంతో ఎవరికీ యాక్సెస్ రాలేదు. తర్వాత బజర్ మోగినప్పుడు యూట్యూబర్ సిరి హన్మంత్ యాక్సెస్ దక్కించుకుంది.
షణ్ముఖ్ జస్వంత్, లోబో ఇద్దరిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాలని సిరి హన్మంతుతో ‘బిగ్ బాస్’ చెబుతాడు. అప్పుడు షణ్ముఖ్ జస్వంత్‌కి పనోడిగా ఉండమని లోబోకి చెప్పంది సిరి. షణ్ముఖ్‌కి లోబో బాడీ మసాజ్ చేశాడు. అతడు సేవలు చేస్తున్నప్పుడు మిగతావాళ్లు నవ్వితే.. ‘ఏయ్! నవ్వకు నువ్వు’ అని లోబో అన్నాడు. ‘పనోడివి పనోడిలా ఉండు’ అని రవి కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ఇంకేం జరిగాయో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఏమైందో ఏమో... సిరికి బిగ్ బాస్ మొదటి హెచ్చరిక జారీ చేశాడు.
‘బిగ్ బాస్’ అంటే గొడవలు కామన్. ఈ రోజు హమీదా, లహరి మధ్య గొడవ జరిగింది. తప్పు ఎవరిదీ అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే... ‘మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడు’ అని లహరి అన్నది. అందుకు బదులుగా ‘నేను ఎలా మాట్లాడాలో నా ఇష్టం. మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు’ అని హమీదా చెప్పింది. తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. లహరి కోపంగా ‘నా ఇష్టం వచ్చినట్టు నేను ఆన్సర్ ఇస్తానంటే నేనెందుకు పడతా. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా?’ అని విశ్వతో తన వెర్షన్ చెప్పుకొంది.