English | Telugu

రోజాకు అడ్డంగా దొరికి పోయిన జ‌బ‌ర్ద‌స్త్ జోడీ!

గ‌త కొంత కాలంగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో ఆక‌ట్టుకుంటున్న జోడీ వ‌ర్ష , ఇమ్మాన్యుయేల్‌. వీరిద్ద‌రి నేప‌థ్యంలో వ‌చ్చే కామెడీ స్కిట్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తూనే వున్నాయి. దీంతో వీరిద్ద‌రూ షార్ట్ టైమ్‌లోనే పాపుల‌ర్ అయిపోయారు. బుల్లితెర‌పై ఈ జంట ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటూ త‌మ‌దైన స్కిట్‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది. దీంతో వీరిద్ద‌రిని జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు బాగానే వాడేస్తున్నారు. వీరిద్దరు ఫేమ‌స్ కావ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి.

ఈ వార్త‌ల్ని మ‌రింత‌గా వాడుఏకోవాల‌ని ప్లాన్ చేసిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ జంట‌కు స్టేజ్‌పై ప‌బ్లిసిటీ పెళ్లి చేసిన‌ట్టుగానే వ‌ర్ష - ఇమ్మాన్యుయేల్ జంట‌కి పెళ్లి చేసేసి షాకిచ్చారు నిర్వాహ‌కులు. అయితే వీరిద్ద‌రిపై రొమాంటిక్ ట్రాక్‌లు మ‌రీ ఎక్కువ కావ‌డంతో రొటీన్ పీలైన నిర్వాహ‌కులు గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రి వేరు వేరుగా ప్ర‌జెంట్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే తాజాగా మ‌ళ్లీ ఈ జోడీని ఒక్క‌టి చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా జబ‌ర్ద‌స్త్ షోకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా తాజాగా వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ గుట్టుని ర‌ట్టు చేసిన‌ట్టుగా తెలిసింది.

డిసెంబ‌ర్ 3న ప్రాసారం కానున్న `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్` ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో యాంక‌ర్ ర‌ష్మీతో పాటు వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ కూడా క‌నిపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇదే ప్రోమోలో రోజా ... వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్‌ల‌ని ఉద్దేశించి రెండు రోజుల క్రితం మీరు ఎక్క‌డ వున్నార‌ని అడిగి వారి గుట్టు బ‌య‌ట‌పెట్టేసి అడ్డంగా బుక్ చేసింది. అయితే వెంట‌నే తేరుకున్న వ‌ర్ష `నేను ఆరోజు షూటింగ్‌లో వున్నాన‌ని, ఇమ్మార్యుయేల్ వేరేచోట వున్నాడ‌ని చెప్పేసింది. వెంట‌నే వ‌ర్ష , ఇమ్మాన్యుయేల్‌ల‌కు సంబంధించిన ఓ సీక్రెట్ ఫొటోని బ‌య‌ట‌పెట్టి షాకిచ్చింది. ప్ర‌స్తుతం ఈ దృశ్యాల‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.