English | Telugu

కొనసాగుతున్న కోర్ట్ రూమ్ డ్రామా.. రోజుకో ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -120 లో....దీప దగ్గరకి పారిజాతం, జ్యోత్స్న లు వస్తారు. ముందు నుండి జాగ్రత్త పడి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పారిజాతం అనగానే.. మీరు చూసి ఇలా ఆనందపడే ఛాన్స్ ఉండేది కాదు కదా అని దీప అంటుంది. అంటే ఇప్పుడు నీ సిచువేషన్ చూసి ఆనందపడుతున్నామా అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే జ్యోతి, కార్తీక్ లు వస్తుంటే.. జ్యోత్స్న, పారిజాతంలు దీప దగ్గర నుండి వెళ్ళిపోతారు. టైమ్ అయిందంటూ లోపలికి వెళ్తారు.

మరొకవైపు సుమిత్ర దగ్గరకి శ్రీధర్ కాంచనలు వస్తారు. సుమిత్ర ఏ టెన్షన్ లేకుండా ఉండడం చూసి.. నువ్వు చాలా గ్రేట్ వదిన అంటుంది. ఎందుకు నీకు కార్తీక్ పై నమ్మకం లేదా అని సుమిత్ర అడుగగా.. ఉంది అని కాంచన అంటుంది. కోర్టులో ఏం జరుగుతుందో, ఏంటో వెళదామని సుమిత్ర అంటుంది. మీరు వద్దు అన్నయ్య జరుగుతుంది మీకు నచ్చనప్పుడు అక్కడ జరిగేది కూడా నచ్చదు.. మేమ్ వెళ్తామంటూ కాంచనని సుమిత్ర తీసుకొని కోర్టుకి వెళ్తుంది. ఆ తర్వాత క్లయింట్ తన భార్య తప్పు చేసిందని ఆధారాలతో సహా నిరూపించాడు. దీప ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉందా అని లాయర్ అడుగుతాడు. ఎందుకు అంటే మళ్ళీ తీర్పు చెప్పే టైమ్ కి కింద పడిపోతే వాయిదా అడుగుతారని VV అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ని లాయర్ పిలుస్తాడు. మీకు దీప ఎప్పటినుండి తెలుసంటూ దీప గురించి ప్రశ్నలు అడుగుతాడు. తను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పడిపోతుంటే పట్టుకుంటే , దాన్ని ఏమంటారని కార్తీక్ అడుగుతాడు సాయమని లాయర్ అంటాడు. మరి నేను దీప విషయంలో చేసింది అదే శౌర్యని తీసుకొని వెళ్లిపోతుంటే వాడి నుండి కాపాడాలని, తన తండ్రి నేనే అంటూ అబద్ధం చెప్పానంటూ, నరసింహా చూపించిన సాక్ష్యాలు అబద్దమని కార్తీక్ చెప్తాడు. దయచేసి ఆ తల్లి కూతుళ్లని విడదీయకండి అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత దీప మాట్లాడుతు.. ఈ నిందలు పడడం.. నా వల్ల కాదు.. నాకు విడాకులు ఇవ్వండి అని దీప అనగానే.. ఏంటి మళ్ళీ ఇదొక ప్లానా అని VV అంటాడు. విడాకులు కావాలంటే బలమైన కారణం ఉండాలని లాయర్ అనగానే.. ఉంది భార్య ఉండగానే భర్త వేరొక పెళ్లి చేసుకుంటే విడాకులు ఇస్తారా అని దీప అడుగగా.. ఇస్తారని లాయర్ అంటాడు. అయితే నరసింహా నేను ఉండగానే శోభ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దీప అంటుంది. వాడు తన ఫ్రెండ్ అని చెప్పాడని VV అనుకుంటాడు. దీప నిన్న చెప్తానన్న కారణం ఇదే అన్న మాట అని జ్యోతి అనుకుంటుంది. ఆ తర్వాత నరసింహా పక్కన ఉన్న ఆవిడే రెండో భార్య శోభ అని దీప చెప్పగానే.. శోభతో మాట్లాడాలని జ్యోతి బోన్ లోకి పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.