English | Telugu

పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈ దేశానికి వెన్నుముక

నటి మాధవి ఇటీవలి కాలంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుతూ జనాల్ని ఇన్స్పైర్ చేస్తోంది. అలాంటి మాధవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది. పిఠాపురంలో జరిగిన సమావేశంలో హోమ్ శాఖ మంత్రి అనితను ఉద్దేశించి బాగా పని చేయాలని చెప్పడం తనకు ఎంతో నచ్చిన అంశం అని చెప్పింది. ఆయన తలుచుకుంటే హోం శాఖ తీసుకోవడం పెద్ద లెక్క కాదు అని చెప్పారు. హోమ్ మినిస్టర్ ఇంకా బాగా పని చేయాలని, పోలీసులకు ఇంకా ఎక్కువగా పవర్స్ ఇవ్వాలి అని చెప్పడం మంచి విషయం అన్నారు. తన సొంత పార్టీని కూడా క్రిటిసైజ్ చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశం అన్నారు.

ఎందుకంటే వేరే పార్టీలని అనడం ఈజీనే కానీ సొంత పార్టీ నేతల గురించి మాట్లాడేంత సాహసం ఎవరూ చేయరు కానీ పవన్ కళ్యాణ్ అది చేశారు అంది మాధవి. అంటే సొంత పార్టీని సెల్ఫ్ క్రిటిసిజమ్ చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ లోపల్లోపల మాట్లాడుకోకుండా ప్రెస్ మీట్ లో అంత గట్టిగా చెప్పడం తనకు ఎంతో నచ్చింది అన్నారు మాధవి. అవసరమైతే హోమ్ శాఖ తీసుకుంటాను , యోగి ఆదిత్యనాథ్ లా చేస్తాను అన్నారు కానీ సొంత పార్టీ వాళ్ళను ఆయన తిట్టనే లేదు అని చెప్పింది మాధవి. రేప్ చేయాలనుకున్న వాడు గత ప్రభుత్వాన్ని చూసి చేస్తాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. నేరస్తుడిని నేరస్తుడిలానే చూడాలి అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆహ్వానించదగ్గవి అని చెప్పింది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈ దేశానికి వెన్నుముక అంటూ చెప్పింది మాధవి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.