English | Telugu
వీళ్ళ గొంతెమ్మ కోరికలు మాములుగా లేవుగా...
Updated : Nov 3, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కార్తీక పౌర్ణమి స్పెషల్ తో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. "మనం ప్రతీ పండక్కి దేవుడిని ఏదో ఒకటి కోరుకుంటాం. మన దేవుళ్ళు ఎవరు..ప్రేక్షక దేవుళ్ళు. ప్రతీ మనిషికి ఒక గొంతెమ్మ కోరిక అనేది ఉంటుంది. బయటకు ఎప్పుడూ చెప్పుకోనిది. ఇప్పుడు వీళ్లంతా వాళ్ళ కోరికలు బయట పెడతారు. ఆడియన్స్ ఎస్ ఆర్ నో అని చెప్పండి" అంటూ శ్రీముఖి ఒక ఫన్నీ సెగ్మెంట్ ని నిర్వహించింది. ముందు ప్రిన్సి వచ్చింది. "దేవుడా ఇంతకు శ్రీముఖికి ఇదే షోలో స్వయంవరం జరిగినట్టు నాకు కూడా స్వయంవరం జరగాలి" అంటూ కోరుకుంది. తర్వాత గాయత్రీ వచ్చింది. "కార్తీక దీపం అనగానే కార్తిక్, దీప మాత్రమే గుర్తొస్తారు కానీ ఈ కార్తీక దీపం నవ వసంతంలో జోత్స్న మాత్రమే అందరికీ గుర్తు రావాలి. ఇదే నా కోరిక" అంది.
అందరూ నో అని చెప్పారు ఆడియన్స్ ని. "అందరికీ మీ వంటలక్కే ఇష్టమమ్మా మా వాంప్ లు ఎందుకు ఇష్టంఉండరమ్మా, నాకు కూడా ఇష్టం లేదనుకో" అంటూ శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. తర్వాత సిరి హన్మంత్ వచ్చింది. పరివారం షోకి యాంకర్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసరికి అందరూ నో అని చెప్పారు ఆడియన్స్. తర్వాత రోహిణి వచ్చి "నాకో తీరని కోరిక ఉంది. నేను నడుస్తూ ఉంటె వెనక 10 మంది అబ్బాయిలు పడాలి. అందులో నేను ఒక అబ్బాయిని ఎంచుకుని పెళ్లి చేసుకోవాలి." అని చెప్పింది. తర్వాత సమీరా భరద్వాజ్ వచ్చింది. "సింగింగ్, యాంకరింగ్ ఐపోయింది. యాక్టింగ్ కోసం నన్ను ఏ రాజమౌళి గారో, సుకుమార్ గారో నాకు ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారంటే ఆ కిక్కే వేరప్పా" అని కోరుకుంది. తర్వాత కావ్య వచ్చింది "ఏ షోస్ కి వెళ్లినా లేదా బయటకు ఎక్కడికి వెళ్లినా ఆర్టిస్ట్స్, యాంకర్స్ అందరూ కలిసి ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్ నను ఎప్పుడూ, ఎవరూ నన్ను అడగకూడదు.. ఎవరైనా అడిగితే వాళ్లకు కూడా నాలాంటి సిట్యువేషన్ రావాలి" అని నేను కోరుకుంటాను అంది. ఆడియన్స్ అంతా ఎస్ అని చెప్పారు. ఇక తర్వాత సుహాసిని వచ్చి "మీ అందరికీ వంట చేసి పెడతాను" అనేసరికి ఆడియన్స్ అంతా నో అన్నారు. ఇలా వీళ్లంతా వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పారు.