English | Telugu
సూర్యని చూడగానే ఏడ్చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Updated : Mar 4, 2022
హీరో సూర్యని చూడగానే బిగ్‌బాస్ రన్నరప్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. హీరో సూర్య నటించిన తాజా చిత్రం `ఈటీ`. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అమ్మాయిలపై అఘాయిత్యాల నేపథ్యంలో ఓ సరికొత్త కథతో రూపొందింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 10న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హీరో సూర్య హైదరాబాద్ వచ్చారు. గురువారం మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వినూత్నమైన చిత్రాలతో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న సూర్యకు తెలుగులో చాలా మంది అభిమానులున్నారు. బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ కూడా సూర్యకు వీరాభిమాని. గురువారం వీరిద్దరి మధ్య అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇంటర్వ్యూలు ముగించుకుని బయటికి వస్తున్న సూర్యకు అక్కడే కూర్చుని తనను గమనిస్తున్న షణ్ముఖ్ కనిపించాడు. వెంటనే వెళ్లి అతన్ని కలిసి పలకరించారు సూర్య.. ఇలా తన వద్దకే తన అభిమాన నటుడు రావడం.. తనని పలకరించడంతో షణ్ముఖ్ ఆ క్షణాన ఉద్వేగానికి లోనయ్యాడు.
Also Read:నాగ శ్రీనుకి నాగబాబు సాయం.. మంచు కాంట్రవర్సీలోకి మెగా ఎంట్రీ!
వెంటనే సూర్య అతన్ని అక్కున చేర్చుకుని భుజం తట్టారు. దీంతో ఉప్పొంగిన ఆనందానుభూతికి లోనైన షణ్ముఖ్ తన అబిమాన హీరోని కలిసిన ఫొటోలని, వీడియోలని సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతే కాకుండా తను షేర్ చేసిన వీడియోకు `నువ్వు ఏం కావాలని కోరుకుంటావో అది దొరక్కపోవచ్చు.. కానీ నీకు దక్కాల్సింది.. అవసరమైనది తప్పకుండా దొరుకుతుంది` అంటూ ఆసక్తికరమైన కామెంట్ ని జోడించాడు షన్ను. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా చాలా రోజులుగా చాలా ఫెయిల్యూర్స్ ని చూస్తున్న నాకు 3-3-2022 రోజు అత్యంత ఆనందకరమైన రోజు.. ఐ లవ్ యూ సూర్య అన్న` అని షన్ను మరో కామెంట్ చేయడం విశేషం.