English | Telugu
మాళవిక - అభిమన్యులకు షాకిచ్చిన యష్ - వేద
Updated : Mar 4, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్‌చ డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, మిన్ను నైనిక,ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మాళవిక కుట్రని తెలుసుకోని వేద తను చెప్పిన మాటలు వినిపి యష్ తో పెళ్లికి నిరాకరిస్తుంది. కూతురు మాత్రమే ఉందని, కొడుకు లేడని తనని నమ్మించి మోసం చేశారంటూ యష్ కుటుంబంపై మండిపడుతుంది.
Also Read:ప్రభాస్ లాంటి హీరోని చూడలేదు!
అక్కడికి నుంచి లోనికి వెళ్లిపోయిన వేదని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న ఖుషీ.. తన తల్లి మాళవిక పన్నిన కుట్రని వేదకు తెలియజేస్తుంది. తన తండ్రి మంచి వాడని, అతనికి ఎలాంటి కుట్రలు తెలియవని, తనకు నువ్వు కావాలని, డాడీ, నువ్వు, నేను ముగ్గురం కలిసి వుందామని చెబుతుంది. దీంతో కన్విన్స్ అయిన వేద తనని విడిచి వెళ్లిపోతున్న ఖుషీని అక్కున్న చేర్చుకుని పెళ్లికి అంగీకరిస్తుంది. ఇరు కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేసి యష్, వేదల పెళ్లి చేస్తారు.
పెళ్లి తరువాత ఊరేగింపుగా వెళుతుంటే యష్, వేదల మధ్యలో నిలుచుని ఖుషీ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వుంటుంది. అది చూసి యష్, వేదలు మురిసిపోతూ వుంటారు. తను కోరుకున్నట్టుగానే యష్, వేదల వివాహం జరగడంతో ఖుషీ ఆ ఆనందంతో మురిసిపోతుంది. ఇద్దరి పట్టుకుని ఫొటోలకు పోజులిస్తుంది. అయితే జరగదు అనుకున్న యష్, వేదల పెళ్లి జరిగిపోవడంతో మాళవిక - అభిమన్యు ఏం చేశారు? .. ఎలాంటి కుట్రకు తెర తీశారు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.