English | Telugu
రుద్రాణి కుట్ర.. ఏం జరగబోతోంది?
Updated : Dec 31, 2021
మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ వారి నీరాజనాలు అందుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. ఈ రోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. గత ఎపిసోడ్ లో రుద్రాణిని మాధురి అరెస్ట్ చేయడం... తను బలవంతంగా ఎత్తుకెళ్లిన బాబుని తిరిగి శ్రీవల్లికి ఇప్పించడం తెలిసిందే. అయితే అందరి ముందు మాధురి తన చెంప పగలగొట్టడం.. శ్రీవల్లి బాబుని తిరిగి వారికే అప్పగించి తనని అవమానించడం భరించలేక రుద్రాణి అవమాన భారంతో రగిలిపోతూ వుంటుంది.
ఇదే సమయంలో సౌందర్యకు కార్తీక్ , దీపల గురించి కీలక ఆధారాలు లభిస్తాయి. కార్తీక్ ఫోన్ లభించిన మహేష్ ని పట్టుకుని రత్నసీత సౌందర్యకు అప్పగించి అసలు విషయం చెప్పిస్తుంది. విషయం తెలియడంతో సౌందర్య .. కార్తీక్, దీపల గురించి వెతకడానికి సాయం చేయాలంటుంది.. అందుకు మహేష్ ఓకే అంటాడు. ఈ రోజు ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారబోతోంది. 1237వ ఎపిసోడ్‌లోకి ప్రవేశించబోతోంది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు జరగబోతున్నాయి.
శుక్రవారం ఎనిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. కార్తీక్ దిగులుగా కూర్చుని ఉంటాడు.. దీప వెళ్లి `ఈ రోజు నేను చాలా సంతోషంగా వున్నాను అంటుంది. అయితే కార్తీక్ మాత్రం దిగాలుగా ఆలోచిస్తూ శ్రీవల్లి వాళ్లు రుద్రాణిపై కేసు పెట్టకుండా వుండాల్సింది.. తను వారిని పగబట్టే అవకాశం వుందంటాడు. దీప మాత్రం జరిగిందేదో జరిగిపోయింది అంటుంది. కట్ చేస్తే...
Also Read: బిగ్‌బాస్ ఓటీటీ అతని చేతికా?
స్టేషన్ నుంచి బయటపడుతుంది రుద్రాణి. అవమాన బారంతో రగిలిపోతూ అమ్మోరికి బలిచ్చే టైమ్ వచ్చిందిరా.. అంటూ కోపంతో ఊగిపోతూ ఏర్పాట్లు చేయండి అంటుంది. అబ్బులు నువ్వు పోతరాజుని పిలిపించి బలి దగ్గరుండి జరిపించు అంటుంది. అక్క బలి తప్పదా? అంటాడు అబ్బులు.. తప్పడం లేదురా.. అంటుంది రుద్రాణి.. తనని అవమానించిన శ్రీవల్లి, కోటేష్ లని హత్య చేయించాలని రుద్రాణి పథకం వేస్తుంది. అవసరమైతే అడ్డుగా వస్తే.. కార్తీక్, దీపలని కూడా చంపేయమంటుంది రుద్రాణి.. రుద్రాణి క్రూరత్వానికి శ్రీవల్లి, కోటేష్ బలికాబోతున్నారా? ఏం జరగబోతోంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.