English | Telugu
బన్నీ ఫ్యాన్స్ చెప్పులతో కొడతారట!
Updated : Nov 15, 2021
ఒక స్టార్ హీరోని అనుకరించడం.. అలా అనుకరించడంలో ఎలాంటి తప్పులు దొర్లినా అవతలి వ్యక్తి పై ఫ్యాన్స్ దాడికి దిగడం.. అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సదరు వ్యక్తిపై ఓ రేంజ్‌లో స్టార్ హీరో అభిమానులు భౌతిక దాడులకు దిగడం కూడా మనకు తెలిసిందే. అలాంటి పరిస్థితే `కామెడీ స్టార్స్` టీమ్ లీడర్ హరికి ఎదురు కానుందా? అంటే యాంకర్ శ్రీముఖి అవునని హెచ్చరిస్తోంది. స్టార్ హీరో ఫ్యాన్స్ చెప్పులతో కొడతారంటూ శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
వివరాల్లోకి వెళితే.. బుల్లితెరపై ఆసక్తికరమైన గేమ్ షోలని క్రియేట్ చేస్తూ వాటిని జనరంజకంగా మలుస్తూ ఆకట్టుకుంటున్న ఓంకార్ `స్టార్ మా` కోసం `కామెడీ స్టార్స్` ప్రోగ్రామ్‌ని ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో ముక్కు అవినాష్ టీమ్, హరి టీమ్, ధన్‌రాజ్, వేణు టీమ్ పోటీ పడుతూ తమదైన కామెడీ స్కిట్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆదివారం ప్రత్యేకంగా వీకెండ్ కావడంతో సరికొత్త స్కిట్‌లతో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
హరి కూడా కొత్త స్కిట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా బన్నీ నటించిన `పుష్ప` చిత్రంలోని `చూపే బంగారమాయెనే శ్రీవల్లీ మాటే మాణిక్య మాయెనే.. అంటూ సాగే పాటకు బన్నీని అనుకరించే ప్రయత్నం చేశాడు హరి. ఈ పాటని ప్రదర్శించే క్రమంలో హరి చెప్పులు జారిపోవడంతో ఈ స్టెప్పులు చూస్తే బన్నీ ఫ్యాన్స్ అదే చెప్పులతో కొడతారేమో చూసుకో అంటూ శ్రీముఖి వార్నింగ్ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.