English | Telugu
Karthika Deepam2 : కార్తీక్ కి అగ్రిమెంట్ పేపర్ ఇచ్చేసిన శివన్నారాయణ.. బయటకు గెంటేస్తాడా!
Updated : Oct 7, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -481 లో..... రెస్టారెంట్ నుండి కాల్ రాగానే వేలంపాట నుండి కార్తీక్ ని తీసుకొని దశరథ్, శివన్నారాయణ బయల్దేరతాడు. బయటకు వెళ్ళాక జ్యోత్స్న ఏం చేస్తుందో ఏమో నువ్వు ఇక్కడే ఉండమని దశరథ్ అనగానే కార్తీక్ ఉండిపోతాడు. కార్తీక్ వేలంపాటలో వెనుక నిల్చొని.. జ్యోత్స్న ఏం చేస్తుందో చూస్తాడు.
వేలంపాట మొదలవుతుంది. వైరా ఇంకా జ్యోత్స్న అసలు తగ్గకుండా వేలంపాట పాడుతారు. పది కోట్లు విలువ గల రెస్టారెంట్ కి ఎక్కువ పాడుతారు. అదేంటి దాని విలువ పది కోట్లే కదా జ్యోత్స్న పోటీపడి ఎక్కువ పాడుతుందని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న పంతొమ్మిది కోట్లు అనగానే వైరా ఇరవై అంటాడు. ఇక ఆపేయాలి, జ్యోత్స్నని ఇంకా ఎక్కువకు పాడించి నష్టాల్లోకి పంపించాలని వైరా అనుకుంటాడు. ఆ తర్వాత వేలంపాటలో జ్యోత్స్న అనేలోపు కార్తీక్ ఎవరితోనో ఫోన్ చేయించి జ్యోత్స్నని బయటకు వచ్చేలా చేస్తాడు. అదేంటి వెళ్ళిపోతుందని వైరా డిస్సపాయింట్ అవుతాడు. జ్యోత్స్న బయటకు రాగానే కార్తీక్ ఉంటాడు. కార్తీక్ నే రప్పించాడని జ్యోత్స్నకి అర్థమవుతుంది. మరొకవైపు వాళ్ళ అత్త కావేరిని కాఫీ అడగలేకపోతాడు కాశీ. అది శ్రీధర్ చూసి స్వప్నని పిలిచి కాఫీ ఇచ్చి పంపిస్తాడు. నువ్వు నీ భర్త అడగముందే ఏదైనా చెయ్యాలని చెప్తాడు.
మరొకవైపు జ్యోత్స్న ఇంటికి వచ్చి నేను వేలంపాట పాడకుండా ఆపాడని శివన్నారాయణకి చెప్తుంది. తనేదో గెలిచి ప్రూవ్ చేసుకుంటా అంటే నువ్వు ఎందుకు అడ్డు పడుతున్నావ్.. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న ఆ అగ్రిమెంట్ పేపర్ తీసుకొని రా అని శివన్నారాయణ చెప్తాడు. నా కూతురు గెలవడం ఇక్కడ ఎవరికి ఇష్టం లేదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని రాగానే కార్తీక్ కి శివన్నారాయణ ఇచ్చి వెళ్ళమంటాడు. తప్పు చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి జ్యోత్స్న అని శివన్నారాయణ అనగానే మెడపట్టుకొని గెంటెయ్యాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.