English | Telugu
Brahmamudi : అప్పుని తిట్టిన కావ్య.. ఇదంతా రాజ్ వల్లేనా!
Updated : Oct 7, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -844 లో......కావ్య దగ్గరకి అప్పు వచ్చి విడాకులు తీసుకుంటానని ఎందుకు అంటున్నావని అడుగుతుంది. అప్పుకి నేను ఆడుతుంది నాటకం అని తెలిస్తే అందరికి తెలిసే ప్రమాదం ఉందని అప్పుకి చెప్పదు. ఏ తల్లి అయిన బిడ్డకి జన్మనివ్వాలనుకుంటుంది. ప్రాణం తియ్యాలనుకోదు.. అలాంటిది మీ బావ నన్ను అబార్షన్ చేసుకోవాలంటున్నాడని కావ్య అంటుంది.
అదంతా రుద్రాణి వింటుంది. అప్పు తన రూమ్ లో ఆలోచిస్తుంటే ధాన్యలక్ష్మి వచ్చి భోజనానికి పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని అప్పు చెప్తుంది. తర్వాత తింటానని అప్పు అనగానే ధాన్యలక్ష్మి వెళ్లి భోజనం చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. అప్పు ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. తర్వాత తింటానని చెప్పిందని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుని వాళ్ళ అక్క ఇష్టం వచ్చినట్లు తిట్టింది.. అందుకే భోజనానికి రాలేదని రుద్రాణి అనగానే చెల్లిని అక్క ఎందుకు తిడుతుందని ఇందిరాదేవి అడుగుతుంది.
మీ గొడవల్లోకి నా కోడలిని లాగకండి అని కావ్యపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఆ తర్వాత అప్పుకి భోజనం తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. తనకి నచ్చజెప్పి భోజనం తినేలా చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య బయట పడుకోమని పంపిస్తుంది. మరొకవైపు సుభాష్, ప్రకాష్ లు కూడా బయట హాల్లో పడుకోవడానికి వస్తారు. నీ వల్లేరా ఇదంతా అని రాజ్ తో సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.