English | Telugu

Karthika Deepam2:  జ్యోత్స్న పారిపోకుండా చేసిన కార్తీక్, దీప.. ఎంగేజ్ మెంట్ జరిగేనా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-415లో.. ఇంట్లో నుండి తన కార్ లో పారిపోతుంటుంది జ్యోత్స్న. నిశ్చితార్థం నుంచి ఇంత ఈజీగా బయటపడతాననుకోలేదు.. పాపం అక్కడ ఏం జరుగుతుందో తెలియక నేను పారిపోతున్నానన్న విషయం తెలియక.. రేపు నిశ్చితార్థం గురించి కలలు కంటూ నిద్రపోతుంటారు.. రేపు నేను లేనని తెలిసి అంతా తెల్లబోతారు. కారుని రైట్‌కి తిప్పి.. చక్కగా శ్రీశైలం పోదామని అనుకుంటూ కారుని రైట్‌కి తిప్పుతుంది జ్యోత్స్న. కారుని ఎందుకు రైట్‌కి తిప్పారు మేడమ్ అనే స్వరం వినిపిస్తుంది. అది ఎవరిదో కాదు మన కార్తీక్ బాబుదే. బిత్తరపోయిన జ్యోత్స్న సడన్ బ్రేక్ వేసి.. బావా నువ్వా.. నువ్వు ఎప్పుడు ఎక్కావ్ కారులో.. అంటుంది.

నాకంటే ముందే ఎక్కారు అమ్మగారు అని దీప అనగానే.. జ్యోత్స్న మరింత షాక్ అవుతుంది. ఇక ఇద్దరు కాసేపు జ్యోత్స్నని ఆడుకుంటారు. చేసేదేమీ లేక జ్యోత్స్న మళ్ళీ ఇంటికే వస్తుంది. మరోవైపు పారిజాతం కంగారుపడతుంటుంది. ఇంతలో ఇంటి కొచ్చిన జ్యోత్స్నని చూసిన పారిజాతం షాక్ అవుతుంది. నువ్వేంటే అని పారిజాతం అనగా.. రావాల్సి వచ్చింది. ఆ దీప, కార్తీక్ నన్ను పోనివ్వలేదు. కారులోనే ఉన్నారంటూ జరిగిందంతా చెప్పి తల కొట్టుకుంటుంది జ్యోత్స్న. ఇక మరునాడు నిశ్చితార్థం ఏర్పాట్లు అన్నీ జరుగుతుంటాయి. దీప, కార్తీక్‌ పనుల్లో మునిగిపోతారు. జ్యోత్స్న రెడీ అయిపోతుంది. పారిజాతం రాగానే.. మనకు ఒక్క ఛాన్స్ ఉంది గ్రానీ.. నువ్వు వెళ్లి ఆ దీప కాళ్ల మీద పడిపోమని అంటుంది.

చూడు గ్రానీ.. ఆ దీపకు మా మమ్మీ అంటే చాలా సెంటిమెంట్.. అదే విషయం గురించి మాట్లాడు.. దాన్ని రిక్వెస్ట్ చెయ్.. గౌతమ్ చెడ్డవాడని చెప్పమని రిక్వెస్ట్ చెయ్ అని దీప దగ్గరకు పంపిస్తుంది పారిజాతం. మరోవైపు మీ అమ్మ ఇంకా రాలేదేంటని కార్తీక్ ని సుమిత్ర, దశరథ్ లు అడుగుతారు. తను రాదు.. తనకు ఇంట్లో కొడుకు, కోడలు, అక్కా ఉన్నారు. వాళ్లని కూడా మీరు పిలిచి ఉంటే సంతోషంగా వచ్చేదని తెగేసి చెప్తాడు కార్తీక్. మరోవైపు దీప దగ్గరకు పారిజాతం వెళ్లి తనను రిక్వస్ట్ చేస్తుంది. నీకు సుమిత్ర రుణం తీర్చుకునే అవకాశం దీపా ఇది అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది పారిజాతం. దీప నిజంగానే కరిగిపోయినట్లుగా ఎక్స్ ఫ్రెషన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.