English | Telugu

Illu illalu Pillalu:  మహానటిని మించిపోయిన శ్రీవల్లి యాక్టింగ్.. పెద్దచేప చిక్కిందిగా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ( Illu illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-216లో.. నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నానంటూ శ్రీవల్లి వస్తుంది. ఏమైందమ్మా.. పుట్టింటికి వెళ్లడమేంటి.. ఏమైందని రామరాజు అడుగుతాడు. ఇక ఇంట్లో ఉన్న వాళ్లంతా వస్తారు. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించండి.. నేను ఇక్కడ ఉండలేనండి.. ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కావడం లేదండి.. అందుకే మా పుట్టింటికి వెళ్లిపోతానండి మామయ్య గారండి అని శ్రీవల్లి అని అంటుంది. ఏంటి ఇంట్లో ఉండటం నీ వల్ల కావడం లేదా.. ఎందుకమ్మా.. ఏమైంది.. పెద్దోడు నిన్ను ఏమైనా అన్నాడా.. మీకు గొడవ ఏమైనా అయ్యిందా అని రామరాజు అడుగుతాడు. లేదు మామయ్య గారు మా ఆయన బంగారం.. నన్ను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని శ్రీవల్లి అంటుంది. మరి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటే అని వేదవతి అడుగగా.. ఎందుకు ఉండాలో నాకు అర్థం కావడం లేదండి.. అసలు ఏముందండీ ఈ ఇంట్లో.. ఏం చూసుకుని ఉండాలి. మీకు జరుగుతున్న అవమానాలను చూడటం కోసం ఉండాలా.. ఆ ఎదురింటి వాళ్లు నడిరోడ్డుపై మీ చొక్కాని చింపేయగానే నా గుండె పగిలిపోయింది. మీకు జరిగిన అవమానం సాక్ష్యాత్తూ మా నాన్నగారికే జరిగినంత బాధగా ఉందంటు శ్రీవల్లి అంటుంది. దాంతో నా సగం జీవితం అవమానాలకే సరిపోయిందమ్మా అని రామరాజు అంటాడు. ఇవన్నీ నాకేం కొత్త కాదు. ఈ విషయాలను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. నువ్వు బాధపడొద్దు.. లోపలికి పదమ్మా అని రామరాజు అంటాడు.

బాధపడొద్దని మీరు చెప్పినంత తేలిక కాదండి మామయ్య గారూ నేను బాధపడకుండా ఉండటం. ఈ ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టడం నా అదృష్టం అనుకున్నా. మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఇంత అందమైన కుటుంబాన్ని తీర్చిదిద్దారని తెలిసిన తర్వాత మీరు దేవుడైపోయారు మామయ్య గారు.. మీకు మీ కుటుంబం సంతోషం గురించి బతకడం తప్ప.. మీకోసం బతకడం తెలియదు. కానీ మీ విలువ, మీ త్యాగం ఈ ఇంట్లో ఎవ్వరికి తెలియదండి.. తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదని శ్రీవల్లి నటించేస్తుంది. ఇంతలో పెద్దోడు కల్పించుకుని.. వల్లీ తెలియకుండా మాట్లాడకు.. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నాన్న అంటే ఎంత ప్రేమో అంతకంటే గౌరవం. ఇంట్లో వాళ్ల దృష్టిలో మా నాన్న ఆకాశం అంత ఎత్తులో ఉంటారని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి.. ఎట్టెట్టా అందరి దృష్టిలో ఆకాశం అంత ఎత్తులో ఉంటారా.. అందుకేనా.. మామయ్య గారి మాటకి నిర్ణయానికి అంత విలువ ఇస్తుందని శ్రీవల్లి అంటుంది.

మామయ్య గారికి ఎవరైనా మర్యాద ఇస్తున్నారా అని శ్రీవల్లి అంటుంది. దాంతో వేదవతి.. ఏయ్.. అవన్నీ ఇప్పుడెందుకే.. నోరు మూసుకుని లోపలికి వెళ్లు.. మర్యాద ఇవ్వడం లేదంటా.. గౌరవం ఇవ్వడం లేదంట.. నిన్నగాక మొన్న ఈ ఇంటి కోడలిగా వచ్చావ్.. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్.. ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నానంటే.. అస్సలు ఊరుకోను. వెళ్లూ లోపలికి అని తిట్టేస్తుంది. ఇక శ్రీవల్లి అందరిని ఇరికిస్తూ.. తన డ్రామాతో అందరిని బ్యాడ్ చేస్తుంటుంది. ‌ఇక తన మాటలని నమ్మేసిన రామరాజు అందరిని అపార్థం చేసుకుంటాడు. నీ మాటలన్నీ విన్న తరువాత.. జరిగినవన్నీ చూసిన తరువాత.. ఎవరేంటో నాకు అర్థమైంది. ఎవరి దృష్టిలో నేనేంటో తెలిసొచ్చింది. అందుకే ఈ ఇంటికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని నాకు జ్ఞానోదయం అయ్యింది. నా నిర్ణయం ఏంటనేది రేపు ఉదయం అందరికి చెప్తాను .. లోపలికి పదమ్మా అని రామరాజు చెప్పేసి వెళ్లిపోతాడు. దాంతో శ్రీవల్లి.. దొంగ కన్నీళ్లని చెరిపేస్తూ.. గొర్రెగాడు పడ్డాడు ఉచ్చులో అని అనుకుంటుంది. అమ్మ చెప్పిన ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. రేపు మామయ్య గారు చెప్పే నిర్ణయం ఏంటో నేను ఊహించిందే.. రేపటి నుంచి ఈ ఇంట్లో నా నిర్ణయానికి తిరిగే ఉండదనుకుంటుంది శ్రీవల్లి. ఇక పెద్దోడు వచ్చి.. పద వల్లీ అంటూ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...