English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న మాటలకు అత్త షాక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -170 లో.....జ్యోత్స్న కాంచన దగ్గరికి వెళ్తుంది. రా జ్యోత్స్న అని కాంచన అనగానే.. మనుషులే అనుకున్నా పిలుపులు కూడా దూరం అయ్యాయన్నమాట అని జ్యోత్స్న అనగానే.. ఏం దూరం అయిందని కాంచన అంటుంది. ఎప్పుడు వచ్చిన.. రా మేనకోడలా అని పిలిచేదానివి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎందుకు నన్ను వద్దనుకున్నావని జ్యోత్స్న అనగానే.. నేను అనుకోలేదు.. మీరే నన్ను వద్దని అనుకోలేదా అని కాంచన అంటుంది.

మీరు వచ్చి తాతయ్య వాళ్ళని అడగొచ్చు కదా అని జ్యోత్స్న అనగానే.. తన గౌరవం తగ్గించే పని చెయ్యలేనని కాంచన అంటుంది. నువ్వు అంత గౌరవంగా ఫీల్ అయితే అక్రమ సంతానం దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. నీ సవతి కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. అది గౌరవమైనా పనా.. దిగజరిపోయి చేసావని జ్యోత్స్న అనగానే.. మర్యాదగా మాట్లాడు అంటూ జ్యోత్స్నపై కార్తీక్ కోప్పడుతారు. నువ్వు ముందు వెళ్లి మీ తాతయ్య, డాడీలని ఒప్పించూ నాకేం అభ్యoతరం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప ఆలోచిస్తుంటే.. మనకి ఏదో చొరవ ఇచ్చారని మాట్లాడకూడదు. వాళ్లకు నచ్చింది మాత్రమే చేస్తారని దీపతో అనసూయ అంటుంది. అప్పుడే కాంచన ఫోన్ చేసి.. శౌర్యని తీసుకొని రా.. అది ఇక్కడే రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పగానే.. దీప సరే అంటుంది.

ఆ తర్వాత ఇప్పుడే తీసుకొని వెళ్ళాలిసింది. తనకి ఒంటరిగా ఉన్నా అనిపిస్తుందేమోనని అనసూయ అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ వాళ్ళు భోజనం చేస్తుంటారు.‌జ్యోత్స ఎక్కడా అని అడుగగా.. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాని అంది అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని శివన్నారాయణ అనగానే.. అత్త వాళ్ళింటికి వెళ్ళానని చెప్తుంది. దాంతో శివన్నారాయణ‌ కోప్పడతాడు. రేపు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళదాం.. తన మనవడితో జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడడానికి అని చెప్పి శివన్నారాయణ‌ వెళ్ళిపోతాడు. వేరే పెళ్లి జరిగితే నీ కూతురు ఉండదని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నీ కూతురు జీవితం నీ చేతిలో ఉందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత సుమిత్ర బయట కూర్చొని ఏడుస్తుంటే.. దీప వచ్చి ఏమైందని అడుగుతుంది జ్యోత్స్నకి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.