English | Telugu

Karthika Deepam2 : పెళ్ళి చేసుకొని వచ్చిన స్వప్న, కాశీ.. నాన్నని పిలిపించమని పెద్దాయాన ఆర్డర్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -160 లో.....స్వప్న, కాశీ లు కార్తీక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నని జాగ్రత్త గా చూసుకో నిన్ను నమ్మి వచ్చిందని కార్తీక్ అనగానే.. ప్రాణం పోయినా చెయ్ వదలనని చెప్పి కాశీ స్వప్నని తీసుకొని వెళ్తాడు. దీప మాతో పాటురా అని కాంచన అంటుంది. అందరి పెళ్లి చేస్తుంది. నా పెళ్లి చేయదా అని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. మరొకవైపు శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి.. నేను క్షేమంగా ఉన్నాను.. మీరు టెన్షన్ పడకండి.. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను.. నేను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారని కాల్ చేస్తున్నాను.. ఈవినింగ్ వస్తానని కాల్ కట్ చేస్తుంది స్వప్న.

ఆ తర్వాత మనం పెళ్లి చేసుకున్నట్లు చెప్పొచ్చు కదా అని కాశీ అంటాడు. ఎప్పుడు మా డాడే సర్ ప్రైజ్ ఇస్తాడా.. నేను ఇవ్వొద్దా అని స్వప్న అంటుంది. మరొక వైపు శ్రీధర్ కీ సుమిత్ర ఫోన్ చేసీ త్వరగా ఇంటికి రండి అన్నయ్య.. జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి ముహూర్తం గురించి అని చెప్తుంది. దానికి శ్రీధర్ సరే అంటాడు. ఆ తర్వాత స్వప్న ఈవినింగ్ వచ్చాక ఎక్కడికి వెళ్లనివ్వకు వచ్చాక మాట్లాడతాను.. అక్కడ కొడుకు పెళ్లి గురించి ముహూర్తం అంట అని కావేరితో శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే.. అప్పుడే స్వప్నని కాశీ తీసుకొని వస్తాడు. తనని చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. వీడిని ఇక్కడ నుండి పంపించాలని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదీంచండి అని పారిజాతంతో కాశీ అంటాడు. దాంతో కాశీని తిడుతుంది పారిజాతం. అప్పుడే దీప, కార్తీక్ కాంచన లు వస్తారు. మమ్మల్ని ఆశీర్వదించండి అని కాశీ మళ్ళీ అనగానే పారిజాతం తిడుతుంది. మా పెళ్లి ఒక మంచి మనిషి సమక్షంలో జరిగిందని కాశీ అంటాడు.

ఎవరి సమక్షంలో అని పారిజాతం అనగానే దీపక్క అని కాశీ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఈ పిల్ల మావయ్య కూతురని తెలిసే ఈ పని చేసినట్లు ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత స్వప్నని పారిజాతం తిడుతుంది. నన్ను తిట్టకండి. నాకు ఒక గౌరమైన ఫ్యామిలీ ఉందని స్వప్న అంటుంది. అందరు ఎక్కడ స్వప్న శ్రీధర్ గురించి చెప్తుందోనని టెన్షన్ పడుతారు. మీ నాన్న ఎవరో పిలిపించమని శివన్నారాయణ అనగానే.. కార్తీక్, దీప లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.