English | Telugu

నాన్నతో చివరి హగ్ ఫోటో అదే.. నరేష్ లొల్ల వాళ్ళ నాన్న ఇక లేరు!

నరేష్ లొల్ల.. అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు.. అమర్ దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు నరేష్ లొల్ల. జానకి కలగనలేదు, గీతాగోవిందం, రామచక్కని సీత వంటి సీరియల్స్‌లో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నరేష్ లొల్ల.. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. గత సీజన్‌లో అమప్ దీప్ హౌస్‌లో గెలుపుకోసం పోరాడితే.. బయట ట్రోలర్స్‌తో పోరాడి వార్తల్లో నిలిచాడు నరేష్ లొల్ల.

నరేష్ లోల్ల.. 'లొల్లాస్ వరల్డ్' అనే యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇక కొన్ని గామడల క్రితం తన తండ్రి హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తూ వ్లాగ్ చేశాడు. అందులో నరేష్ ఏం అన్నాడంటే.. ఇలాంటి పరిస్థితి తనకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని, మీ బ్లెస్సింగ్ నాకు కావాలి. దీన్ని మీరు నెగిటివ్ అనుకున్నా పబ్లిసిటీ అనుకున్నా పర్లేదు. నాకు ఫస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చింది. మా డాడీ అంటే ఎంత ఇష్టమో.. పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నేను పుట్టినప్పటి నుంచి చాలా విషయాలు మా డాడీకి చెప్పుకోలేదు. అవన్నీ చెప్పుకోవాలని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాను. మా డాడీకి 60 ఇయర్స్ బర్త్ డే సెలబ్రేషన్ చేశాను. ఆరోజు డాడీతో మనసు విప్పి మాట్లాడాను.

నేను పుట్టినప్పటి నుంచి నాతో చెప్పని చాలా విషయాలు ఆయన నాతో చెప్పారు. కానీ ఒక్కరాత్రిలో లైఫ్ మొత్తం మారిపోయింది. మా డాడీ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలి. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని బ్లెస్ చేయండి అని వ్లాగ్ చేశాడు. అయితే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే నరేష్ లొల్ల వాళ్ళ నాన్న చనిపోయారు. ఇదే విషయాన్ని తెలుపుతూ లొల్ల తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.