English | Telugu

Brahmamudi : ఆ పాపని అప్పు కనిపెడుతుందా.. రాహుల్ కొత్త కంపెనీలో మార్పులు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -890 లో.....అందరు భోజనం చేస్తారు. రాహుల్ నువ్వు కొత్త ఆఫీస్ కి వెళ్ళు.. రాజ్ నువ్వు నీ ఆఫీస్ కి వెళ్ళమని సుభాష్ చెప్తాడు. ఇద్దరు సరే అంటారు. నాతో పాటు కావ్య కూడా వస్తుందట అని రాజ్ అనగానే వద్దని అపర్ణ అంటుంది. తనకి ఆఫీస్ కి వస్తే మైండ్ షార్ప్ ఉంటుందట అని రాజ్ అనగానే ఇక తప్పక ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు.

నేను నా వర్క్ చేస్తాను.. ఇక అప్పు కూడా డ్యూటీ కి వెళ్తుందని కళ్యాణ్ అనగానే డెలివరీ వరకు నో డ్యూటీ అని చెప్పాను కదా అని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు బయటకు వచ్చి ఇప్పుడు ఎలా ఆ పాపకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎలా చెయ్యాలని అప్పు అంటుంది అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. వాళ్ళకి విషయం చెప్తారు. ఒకావిడకి న్యాయం చేయాలి అనుకుంటున్నావు చెయ్ అని రాజ్ సలహా ఇస్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇప్పుడు మీరు అప్పుకి ఎందుకు అలాంటి సలహా ఇచ్చారని కావ్య కోప్పడుతుంది. ఎందుకు నీకు టెన్షన్ అని రాజ్ కూల్ గా చెప్తాడు. చిన్నత్తయ్య గురించి మీకు తెలుసు కదా.. తనని కాదని ఏదైనా చేస్తే శత్రువులాగా చూస్తుందని కావ్య అనగానే.. అప్పు అన్నదాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే ఒక తల్లికి న్యాయం చేస్తుందని రాజ్ అంటాడు.

ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తుంటే.. అపర్ణ అన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తుంటే మీరెక్కడికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. గుడికి అని అప్పు చెప్తుంది. అయితే ఆ బ్యాగ్ ఏంటి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. దాంతో కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. ఆ బ్యాగ్ లో అప్పు యూనిఫామ్ ఉంటుంది. తరువాయి భాగంలో స్వరాజ్ కంపెనీ నుండి మేనేజర్ ని రాహుల్ తన కంపెనీకి తీసుకుంటాడు. ఆ విషయం రాజ్, కావ్యలకి తెలుస్తుంది. మరొకవైపు స్వరాజ్ గ్రూప్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళని మొత్తం ఈ కంపెనీకి షిఫ్ట్ చెయ్యమని మేనేజర్ తో రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.