English | Telugu

Jayam serial : గంగకి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్న రుద్ర.. తాంబూలాలకి శకుంతల ఏర్పాట్లు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -106 లో....ఇషిక, వీరు ఇద్దరు కలిసి పారుని కలుస్తారు. అసలు రుద్ర ఎలా ఒప్పుకున్నాడని పారు అడుగుతుంది. పెళ్లికూతురు నువ్వే అని తెలియదని ఇషిక చెప్తుంది. ఒకవేళ నేను అని తెలిసాకా రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటని పారు అడుగుతుంది. నో.. రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు.. ఎందుకంటే శకుంతల అత్తయ్య ఎమోషనల్ గా లాక్ చేసిందని వీరు చెప్తాడు.

మరొకవైపు నా ప్రేమ అంత నిజం అనుకుంటున్నావా రుద్ర అంత నాటకం అని శకుంతల అనుకుంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్లంతా శకుంతల దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. మీరు రుద్ర అన్నయ్య క్షమించడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు రుద్ర అన్నయ్యకి కాబోయే భార్య ఎవరని ప్రీతి అడుగుతుంది. తినబోతు రుచి ఎందుకు.. తనని ఇంటికి రమ్మని చెప్పాను.. వస్తుంది అప్పుడే చూడండి అని శకుంతల అంటుంది. తాంబులాలు కూడా మార్చుకోవాలని శకుంతల అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్ని మరి ఇంత ఫాస్ట్ గానా అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు.

మరొకవైపు గంగని రుద్ర ప్రాక్టీస్ చేపిస్తాడు. రన్నింగ్ చెయ్ అని రుద్ర అనగానే ఎందుకు రన్నింగ్ ఇవన్నీ వద్దు బాక్సింగ్ నేర్పించండి అని గంగ అంటుంది. ఇవ్వన్నీ నేర్చుకుంటేనే బాక్సింగ్ సులువు అవుతుందని రుద్ర అంటాడు. మరొకవైపు రుద్రకి పెళ్లిచూపులు అని హడావిడి చేస్తుంది శకుంతల. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.