English | Telugu

Illu illalu pillalu : నర్మద లంచం తీసుకుందంటూ వార్తలు.. అదంతా భద్రవతి ప్లాన్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -309 లో......సేనాపతి అన్న మాటలు వేదవతి గుర్తుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే నర్మద వస్తుంది. నీతో మాట్లాడాలి నర్మద అని వేదవతి అంటుంది. నువ్వు మా వాళ్ళ జోలికి వెళ్ళకు వాళ్ళ పగ నీకు తెలియదు ఇరవై అయిదేళ్లుగా నేను వాళ్ళ పగని చూస్తున్నాను..పరువు కోసం ఏమైనా చేస్తారని నర్మదతో వేదవతి చెప్తుంది. అలాగని నా వృత్తికి అన్యాయం చెయ్యలేనని నర్మద చెప్తుంది.

అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా అని వేదవతి కోప్పడుతుంది. సారీ అత్తయ్య అని నర్మద చెప్తుంది. అదంతా శ్రీవల్లి విని హమ్మయ్య అత్త కోడళ్ళకి గొడవ స్టార్ట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ప్రేమ బయట కూర్చొని ఆలోచిస్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి ఇంత చల్లగాలిలో ఏం చేస్తున్నావ్.. పదా లోపలికి వెళదామని అంటాడు‌ రానని మొండి గా అక్కడే కూర్చుంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ బట్టలు తీసుకొని వచ్చి బయటే పడుకోవడానికి సిద్ధం చేస్తుంటే.. వెళ్లి ప్రేమ పడుకుంటుంది. నేను నీ బాధ్యత అన్నావ్ కదా ఇక్కడ పడుకుంటున్నా.. నన్ను చూస్తూ ఉండు అని ప్రేమ అంటుంది. ప్రేమ మంచిగా పడుకుంటుంది.. ధీరజ్ తనని చూస్తూ ఉంటాడు.

మరొకవైపు అప్పుల వాళ్లు భాగ్యం, ఆనందరావుని వెంబడిస్తుంటే వాళ్లిద్దరు దాక్కుంటారు. ఈ బాధ తీరాలంటే రామరాజు దగ్గరికి వెళ్లి బిజినెస్ పెట్టుబడికి డబ్బు అడగాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని రామరాజు ఇంటికి వెళ్తారు మావయ్య ఇంట్లో లేరని శ్రీవల్లి చెప్తుంది. దాంతో తామెందుకు వచ్చారో శ్రీవల్లికి చెప్తారు‌ రెండు రోజులు ఇక్కడే ఉంటామని భాగ్యం అనగానే.. శ్రీవల్లి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత నర్మద ఆఫీస్ కి వెళ్తుంటే వేదవతిని పలకరించినా కూడా నర్మదతో మాట్లాడదు. తరువాయి భాగంలో నర్మద లంచం తీసుకుంటుందని మీడియా వాళ్ళు నర్మద దగ్గరికి వస్తారు. అది న్యూస్ లో చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.