English | Telugu

Karthika Deepam2: సీఈఓ పదవి నుండి జ్యోత్స్నని పీకేసిన శివన్నారాయణ.. షాక్ మీద షాక్!

స్టార్ట్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -508 లో.....శివన్నారాయణ దగ్గరికి పారిజాతం వస్తుంది. రేపు బోర్డు మీటింగ్ లో జ్యోత్స్ననే సీఈఓగా కొనసాగుతుందని చెప్పండి అని పారిజాతం అనగానే జ్యోత్స్న నీతో చెప్పమని చెప్పిందా నీపై నమ్మకం లేక తను కూడా వచ్చిందా అని శివన్నారాయణ గోడకి తొంగి చూస్తున్న జ్యోత్స్నని ఉద్దేశ్యించి అంటాడు. జ్యోత్స్నని లోపలికి పిలుస్తాడు. నువ్వు సీఈఓ పోస్ట్ కి రాజీనామా చెయ్.. ఆ తర్వాత ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది.

మరుసటిరోజు ఉదయం కార్తీక్ కి దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. దీప డల్ గా ఉంటుంది. ఏమైందని అడుగుతుంది. ఈ రోజు జ్యోత్స్న సీఈఓగా ఉండాలో లేదో నిర్ణయం తీసుకునే రోజు .. దానివల్ల కుటుంబంలో ఎన్ని గొడవలు వస్తాయోనని భయంగా ఉందని అని దీప అంటుంది. నువ్వేం కంగారు పడకు ఇంట్లో ఏ గొడవ జరిగిన కూడా నేను చూసుకుంటాను.. ఇంట్లో అన్ని సమస్యలు తీరాకే నీ గురించి ఇంట్లో చెప్తానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శివన్నారాయణని కాకా పడితే ప్లాన్ ఫెయిల్ అయిందని ప్రొద్దున దశరథ్ దగ్గరికి జ్యోత్స్న, పారిజాతం వచ్చి సీఈఓ గా తననే కంటిన్యూ చెయ్యమని అడుగుతారు. అసలు నేను మీ కూతురినే కదా నాకే బాధ్యతలు ఇవ్వాలని జ్యోత్స్న అంటుంది. ఇప్పటివరకు ఇస్తేనే ఇలా చేసావని దశరథ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఏదైనా మా ఇష్టం కాదు బోర్డు మెంబర్స్ ఇష్టమని శివన్నారాయణ అంటాడు.

అప్పడే కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. ఇంట్లో మగవాళ్లకేనా నిర్ణయం తీసుకునే అర్హత ఆడవాళ్లకి లేదా జ్యోత్స్నకి తల్లిగా సుమిత్రకి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు లేదా అని పారిజాతం అడుగుతుంది. నువ్వు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందని శివన్నారాయణ అంటాడు. చెప్పు సుమిత్ర నువ్వేం చెప్తే అది అని శివన్నారాయణ అన్నాడు. చెప్పు మమ్మీ అని జ్యోత్స్న హుషారుగా అడుగగా సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. జ్యోత్స్నని పెళ్లి కూతురుగా చూడాలని అనుకుంటున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.