English | Telugu

Eto Vellipoyindhi Manasu : అడుగడుగునా యాగానికి అడ్డంకులే.. భార్యాభర్తలు కలిసి పూర్తిచేయగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -203 లో...... రామలక్ష్మి మోకాళ్ళ పై ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఇలా పీడ కల వచ్చింది అందుకే ఇలా చేస్తే మంచి జరుగుతుందని, ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. ఏం చేసిన మీ గురించి కదా బాబు ఆపకండి అని సుజాత అనగానే.. సరే అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. శ్రీవల్లి తన ముందు కొబ్బరి చిప్పలు వేస్తుంది దానిపై కాలు వెయ్యడంతో గుచ్చుకొని రక్తం వస్తుంది.

అది చూసి సీతాకాంత్ కంగారుపడుతూ పక్కన కూర్చొపెట్టి పసుపు పెడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు పంతులు దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి, ఇది కింద పడకుండా తీసుకొని వెళ్లి యాగం లో ఉపయోగించండి అని అంటాడు. దాంతో రామలక్ష్మి వాటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంది. ఎలాగైనా అవి పడేయాలని శ్రీవల్లి అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ ఆపి కొంచెం మెల్లిగా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి నడుస్తుంటే తన కాలు అడ్డం పెడుతుంది. కాని శ్రీవల్లినే కింద పడిపోతుంది. ఆ తర్వాత రామాలక్ష్మిపై ఎలా ఎటాక్ చెయ్యాలి అని రౌడీ ఆలోచిస్తుంటే అప్పుడే తన పట్టి కింద పడిపోవడం రౌడీ చూస్తాడు. అది తన చేతిలోకి తీసుకుంటాడు ఆ తర్వాత రామలక్ష్మి తన పట్టి లేదని చూసుకొని ఎక్కడో పడిపోయింది చూస్తానని రామలక్ష్మి వెళ్తుంది. మరొకవైపు ఆగిపోయే యాగానికి నువు ఎందుకు హడావిడి చేస్తున్నావని శ్రీలతతో సందీప్ అంటాడు. ఇలా చేస్తే మనపై డౌట్ రాదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి స్వామి వేషమ్ లో ఉన్న రౌడీ దగ్గరికి వస్తుంది. తన పట్టి చూసి తీసుకుంటుంది. అప్పుడే రౌడీ కత్తి తియ్యబోతుంటే సీతాకాంత్ వాళ్లు వస్తారు.

ఆ తర్వాత అందరు యాగం దగ్గర సకల వస్తారు. రామలక్ష్మి సీతాకాంత్ లు కలిసి రావడం చూసి వాళ్ళు వస్తున్నారని ఆశ్చర్యంగా శ్రీలత సందీప్ లు చూస్తారు. ఆ తర్వాత ఈ యాగాన్ని ఆపడానికి నేను ట్రై చేసాను కానీ వర్కవుట్ కాలేదని వాళ్ళతో శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత యాగం దగ్గర పనులు చేస్తుంటే.. నీ లాంటి చెడు ఆలోచనలున్న వాళ్లు ముట్టుకోవద్దని మాణిక్యం అంటాడు. అప్పుడే అందరు వస్తారు. మీ నాన్న అత్తయ్యని ఇలా అన్నాడని రామలక్ష్మికి శ్రీవల్లి చెప్తుంది. ఏదో తెలియక అన్నాడని సుజాత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.