English | Telugu
Karthika Deepam2 : నా బావకి దగ్గర కావాలని చూస్తున్నావా.. దీప ఫైర్!
Updated : Sep 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -152 లో.. అనసూయ, శౌర్యల దగ్గరికి పారిజాతం వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకండని అనసూయ అంటుంది. నా ఇష్టం.. ఇది నా ఇల్లు ఇష్టమైతే ఉండండి లేదా వెళ్లిపోండి అని పారిజాతం అంటుంది. అప్పుడే దీప వస్తుంది. కార్తీక్ కీ ఎలా వుంది నన్ను తీసుకొని రమ్మన్నాడా అని దీపని శౌర్య అడుగుతుంది. ఆ నువ్వు పెద్ద విఐపివి మరి సొంత మనవడు నన్నే వద్దన్నాడు.. నిన్ను రమ్మని అంటాడా అని పారిజాతం అంటుంది.
అప్పుడే దీపకి కాంచన ఫోన్ చేసి.. శౌర్యని తీసుకొని రా కార్తీక్ చూడాలి అంటున్నాడని చెప్తుంది. ఎవరు అమ్మ ఫోన్ లో అని శౌర్య అనగానే.. కాంచన అమ్మ.. కార్తీక్ బాబు నిన్ను చూడాలి అంటున్నాడంట తీసుకొని రమ్మని చెప్పిందని దీప అంటుంది. ఆ తర్వాత అనసూయ, దీపని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. చూసావా నేను విఐపినా అన్నావ్ కదా.. కార్తీక్ నన్ను పిలిచాడు.. నిన్ను పిలిచాడా అని పారిజాతానికి శౌర్య కౌంటర్ వేస్తుంది. మరొకవైపు నాన్న గుడ్ న్యూస్ చెప్తాడని స్వప్న స్వీట్ తో రెడీగా ఉంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. ఒకసారి కాశీ కీ ఫోన్ చెయ్ అంటాడు. ఇప్పుడే కదా అక్కడ నుండి వచ్చావని స్వప్న అనగానే.. ఒక విషయం చెప్పాలని శ్రీధర్ అంటాడు. అలా అనగానే కాశీకి స్వప్న ఫోన్ చేస్తుంది. నువ్వు సిటీకీ వచ్చింది జాబ్ చెయ్యడానికి కదా.. అలా కాదని ప్రేమ అంటూ నా కూతురు వెంటపడితే మర్యాదగా ఉండదంటు కాశీకీ శ్రీధర్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత నేను చెప్పిన అబ్బాయిని కాదని గడప దాటినా వాడిని బ్రతకానివ్వనని చెప్పి.. స్వప్న ఫోన్ నా దగ్గర ఉంచుకుంటా అని శ్రీధర్ లోపలికి వెళ్ళిపోతాడు.
అమ్మ నీ ఫోన్ ఇవ్వు కాశీకి చేస్తానని స్వప్న అనగానే అలా ఫోన్ చేసిన వాడిని బ్రతకనివ్వను.. నేను బ్రతకనని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత శౌర్యని తీసుకొని దీప వస్తుంది. కార్తీక్ దగ్గరికి శౌర్య వెళ్లి సరదాగా మాట్లాడుతుంది. దీప కిచెన్ లో వంట చేస్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి.. మా బావకి దగ్గర కావాలని చూస్తున్నావా అనగానే దీప తన పైకి చెయ్ ఎత్తుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.