English | Telugu
భార్య అలిగిందని అలా చేసిన భర్త!
Updated : Jul 29, 2024
ప్రతీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అలాగే వాటిని ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కారించుకుంటే తొలగిపోతాయి. అయితే భార్య అలక తీర్చేందుకు సీతాకాంత్ ఓ పని చేశాడు. ఎవరీ సీతాకాంత్ అనే కదా డౌట్.. అదేంటో ఓసారి చూసేద్దాం.
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో ఈ మధ్య బాగా క్రేజ్ తెచ్చుకుంటున్న సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు ( Eto Vellipoindhi Manasu ). ఈ సీరియల్ లో రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి, సీతాకాంత్ పాత్రలో సీతాకాంత్ చేస్తున్నాడు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ టీవీ అభిమానులకి తెగ నచ్చేసినట్టుంది. అందుకేనేమో వీరిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సీతకాంత్ కి సీరియల్స్ లో ఇప్పటికే క్రేజ్ ఉంది. తను చేసిన ' అమెరికన్ అమ్మాయి' అనే సీరియల్ అయిపోయి ఈ మధ్యే తొమ్మిది సంవత్సరాలు అయింది. ఆ సీరియల్ సీతాకాంత్, బిగ్ బాస్ మెరీనా నటించారు. అది అప్పట్లో హిట్ పేర్ గా నిలవగా.. ఇప్పుడు రక్ష నింబార్గి, సీతాకాంత్ ల జోడీ భళే కుదిరింది.
ఎటో వెళ్ళిపోయింది మనసు ( Eto Vellipoindhi Manasu) లో సీరియల్ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీతాకాంత్, రామలక్ష్మి ప్రేమించుకొని విడిపోతారు. ఆ జన్నలో విడిపోయిన ఇద్దరు ఈ జన్మలో కలుసుకుంటారు. ఓ స్వామిజీ వారిద్దరి గత జన్మ తాలుకా జ్ఞాపకాలని సీతాకాంత్ కి చూపిస్తాడు. ఇక ఈ జన్మలో సీతాకాంత్ రామలక్ష్మి పెళ్ళి చేసుకుంటారు. అయితే సవతి తల్లి కుల్లు కుతంత్రాలు తెలియని సీతాకాంత్ అమాయకంగా తనేం చెప్తే అదే చేస్తాడు. ఇది తెలుసుకున్న రామలక్ష్మి శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అత్తాకోడల్ల మధ్య వార్ మొదలైంది. ఇక తాజా ఎపిసోడ్ లలో సందీప్ చేసిన ల్యాండ్ డీలింగ్ వెనుక నిజానిజాలు రామలక్ష్మి బయటపెడుతుంది. దాంతో రామలక్ష్మిని పొగిడి కొన్ని కీలక భాద్యతలు అప్పగిస్తాడు సీతాకాంత్. దాంతో రామలక్ష్మికి శ్రీలత మరో సవాల్ విసురుతుంది. ఇక అమ్మ మీద ప్రేమతో రామలక్ష్మి మీద సీతాకాంత్ కోప్పడుతుంటాడు దాంతో రామలక్ష్మి అలిగి కూర్చుంటుంది. తన అలక తీర్చడం కోసం సీతాకాంత్ సర్ ప్రైజ్ లు ఇస్తుంటాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో రామలక్ష్మిని హోటల్ లో డిన్నర్ కి తీసుకెళ్తాడు. అది చూసి రామలక్ష్మి ఇంప్రెస్ అవుతుంది. అలక తీరిందా అని సీతాకాంత్ అనగా తీరిందని స్మైల్ ఇస్తుంది రామలక్ష్మి. కానీ ఇద్దరు మనసులో మాట చెప్పకుండా మౌనంగా ఉంటారు. మరి వీరిద్దరి మనసులోని మాటని ఎప్పుడూ బయటపెడతారు. ఎప్పుడు ఒక్కటి అవుతారని ఈ సీరియల్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రోమో నెట్టింట అత్యధిక వీక్షకాధరణ పొందుతుంది.