English | Telugu
చిన్ని సీరియల్ లో బ్రహ్మముడి కావ్య!
Updated : Jul 29, 2024
బుల్లితెర ధారావాహికల్లో బ్రహ్మముడి సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కొత్త సీరియల్స్ వస్తున్నప్పటికీ దీనికి క్రేజ్ తగ్గట్లేదు.
ఇక నేటి నుండి స్టార్ మా టీవీలో ' చిన్ని' ప్రసారం కానుంది. ఇది మొదలయ్యే కంటే ముందే భారీగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, టీవీ లో ప్రోమోలతో హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సీరియల్ లో మరో సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ప్రోమోని వదిలారు మేకర్స్. ఈ ప్రోమోలో చిన్నిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయాలని ఎత్తుకెళ్తుంటారు. అప్పుడే అమ్మవారి అవతారంలో బ్రహ్మముడి కావ్య ఎంట్రీ ఇస్తుంది. తను వెళ్ళి ఆ దుండగులని కొట్టి చిన్నిని కాపాడుతుంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.
బ్రహ్మముడిలో రాజ్ కి భార్యగా దుగ్గిరాల ఇంటి కోడలిగా కావ్య అలియాస్ దీపిక రంగరాజు క్రేజ్ పొందింది. ఈమె తెలుగు నేర్చుకుంటూ , టీవీ షోలలో అప్పుడప్పుడు కన్పిస్తుంది. స్టార్ మా పరివారంలో తను వేసే పంచ్ లు అప్పుడప్పుడు ఇన్ స్టాలో రీల్స్ గా వస్తుంటాయి. ఇక టీవీలో వచ్చే చిన్ని సీరియల్ ప్రోమోలో దీపిక రంగరాజుని చూస్తే బ్రహ్మముడి సీరియల్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.