English | Telugu
రాహుల్ ఆల్ఫా మేల్ ... కానీ మీ అందరిలా టాక్సిక్ ఆల్ఫా మేల్ కాదు
Updated : Jul 29, 2024
చిన్మయి శ్రీపాద ఏదైనా కుండ బద్దలు కొట్టేస్తుంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ అందరి గుండెల్లో దడ పుట్టించిన చిన్మయి మాట్లాడే మాటలు వింటే ఇలాంటి అమ్మాయిని భరిస్తూ ఆ రాహుల్ ఎలా ఉంటున్నాడురా బాబు అనుకోకుండా ఉండరు. ఇప్పుడు అదే జరిగింది. చిన్మయి రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది. "తండ్రి కూతుళ్ళ రిలేషన్ లో తప్పులు వెతుకుతున్నారు అని అందరూ నన్ను అంటున్నారు కానీ నేను అది కాదు చెప్పింది నా హజ్బెండ్ రాహుల్ కి. కొంతమంది మీమర్స్ కి అసలు ఎప్పుడూ నా గురించే ఆలోచన.. అసలు ఆ రాహుల్ నాతో ఎలా బతుకుతున్నాడా, ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడా అన్నదే అల్లాలోచిస్తూ ఉంటారు. దీన్ని వదిలేసి వెళ్ళిపో మావా...డివోర్స్ ఇచ్చేయ్ మామ అని అరుస్తూ, వాగుతూ కూర్చుంటారు.
పాపం వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ లో ప్రొబ్లెమ్స్ ఏంటో నాకు తెలీదు కానీ. చెప్పాలంటే మా పెళ్లి జీవితం చాలా సంతోషంగా ఉంది. నేను ఎవరికైతే నచ్చనో వాళ్ళ దగ్గర నుంచి నేనే ముందుగా వెళ్ళిపోతాను. అసలు విషయం చెప్పాలంటే రాహుల్ పక్కా ఆల్ఫా మేల్ కానీ మీ అందరి లాగా టాక్సిక్ ఆల్ఫా మేల్ ఐతే కాదు." అంటూ కొంతమంది మీమర్స్ కి కౌంటర్ ఇచ్చింది. చిన్మయి డిక్షనరీలో అసలు మొహమాటం, సిగ్గు లాంటి పదాలకు అసలు అర్ధమే ఉండదు. వైరముత్తు, సింగర్ కార్తిక్ లాంటి వారి భాగోతాలను నిర్భయంగా బయటకు చెప్పి సెన్షేషనల్ మారింది చిన్మయి. ఇప్పటికీ ఈ ఇద్దరితో కలిసి పని చేసేందుకు చిన్మయి నో చెబుతూనే ఉంటుంది.