English | Telugu
Guppedantha Manasu : మోస్ట్ రొమాంటిక్ సీన్.. హీటెక్కించిన గుప్పెడంత మనసు ఎపిసోడ్!
Updated : Aug 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1146 లో..... శైలేంద్ర వాళ్ల ఇంటికి సరోజ వచ్చి.. నా బావ రంగా అంటూ చెప్తుంది. అతను నా బావకి డబ్బులిచ్చి ఇక్కడికి తీసుకోని వచ్చాడంటూ శైలేంద్రని చూపిస్తుంది సరోజ. రా బావ అంటూ రిషి చెయ్ పట్టుకుంటుంది. నేను రాను ఎందుకు అంటే నేను రంగాని కాదు రిషిని అని చెప్తాడు. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఎందుకు ఇదంతా చేసావ్.. ఎందుకు ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందంటు శైలేంద్రని ఫణీంద్ర కొడతాడు. ఇక ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమని ఫణింద్ర అన్నట్లు వద్దు వద్దు అంటూ ఒక్కసారిగా శైలేంద్ర కల కంటూ నిద్ర నుండి ఉలిక్కిపడి లేస్తాడు. ఏంటి రంగా గాడు రిషి అంటున్నాడు.. ఇదంతా కలనా అని టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. ఎందుకు అలా కంగారు పడుతున్నారని అడుగుతుంది.
ఆ తర్వాత వసుధార, మహేంద్రలు హాల్లో కూర్చొని.. టీ తాగుతుంటారు. అప్పుడే శైలేంద్ర రావడం గమనించిన వసుధార.. ఒక అట ఆడుకోవాలని అనుకుంటుంది. అసలు రిషి సర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉందని వసుధార అనగానే.. అదేం లేదమ్మా బానే ఉన్నాడని మహేంద్ర అంటాడు. ఆ రంగా గాడు బాబాయ్ ని నమ్మించాడు కానీ ఈ వసుధార కి డౌట్ వచ్చేలా చేస్తున్నాడని శైలేంద్ర అనుకొని.. వసుధారని డైవర్ట్ చేయాలని ఇన్ని రోజులు రిషి రాలేదన్నావ్.. ఇప్పుడు ఇలా అంటున్నవని అంటాడు. అప్పుడే రిషి రంగాలాగా వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ వస్తుంటాడు. రిషిని చూసిన మహేంద్ర.. ఏంటి రిషి అలా వస్తున్నాడని అనుకుంటాడు. అంటే ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నాడు కదా అలా అలవాటు అయిందేమో అంటు.. తమ్ముడు నీతో మాట్లాడాలని రిషిని పక్కకి తీసుకొని వెళ్తాడు శైలేంద్ర.
మరొకవైపు రంగాపై రాధమ్మ బెంగపెట్టుకుంటుంది. అప్పుడే సంజీవయ్య వచ్చి.. నీ మనవడు బానే సంపాదిస్తున్నాడు.. ఒక్కసారి పదిలక్షల అప్పు తీర్చాడని అంటాడు. అసలు నీతో మాట్లాడాడా అని సంజీవయ్య రాధమ్మని అడుగుతాడు. లేదు బుజ్జితో మాట్లాడాడని రాధమ్మ చెప్తుంది. మరొకవైపు వసుధార తల స్నానం చేసి తల తుడుచుకుంటుంటే.. వసుధారని రిషి అలానే చూస్తూ ఉంటాడు. దగ్గరికి వచ్చి రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. ఇన్ని రోజులు నిన్ను చాల మిస్ అయ్యాను.. ఇక నీకు దూరంగా ఎప్పుడు ఉండనని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.